`మెర్స‌ల్‌` హోర్డింగ్‌.. మ‌నుషుల‌పై ప‌డింది!!

Monday, October 30th, 2017, 10:26:15 AM IST

ప‌బ్లిక్ రోడ్‌లో హోర్డింగులు, ప్ర‌మోష‌న‌ల్ క‌టౌట్లు పెట్ట‌రాద‌ని ఇదివ‌ర‌కే కోర్టులు తీర్పు వెలువ‌రించాయి. అయినా ఇప్ప‌టికీ హోర్డింగులు నిరాఠంకంగా వెల‌స్తూనే ఉన్నాయి. వాటిని చూస్తూ యాక్సిడెంట్లు కామ‌న్‌గానే జ‌రుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ క‌టౌట్ ఒక‌టి .. కుప్ప‌కూలి మ‌నుషుల‌పై ప‌డింది. అదృష్ట‌వ‌శాత్తూ ఎవ‌రికీ ఏం కాలేదు కానీ, ఒక‌వేళ అయ్యి ఉంటే పెద్ద ర‌చ్చ‌య్యేదే. అస‌లింత‌కీ ఎవ‌రిదీ హోర్డింగ్ అంటే.. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌టౌట్‌.

రీసెంటుగానే `మెర్స‌ల్` ప్ర‌మోష‌న్స్ వేళ ఏర్పాటు చేసిన 28 అడుగుల‌ భారీ క‌టౌట్ ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గం.ల ప్రాంతంలో తిరుపోరూర్ స‌మీపంలో వెళుతున్న కార్‌పై ప‌డింది. దీంతో కార్‌లో ఉన్న ప్ర‌యాణీకులు స‌హా డ్రైవ‌ర్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కోర్టు ఆర్డ‌రు త‌ర్వాత ఈ త‌ర‌హా క‌టౌట్లు తొల‌గించాల్సిందిగా హీరో విజ‌య్ త‌న అభిమాన సంఘాల‌కు సూచించారుట‌. కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడిలా ఊహించ‌ని ప్ర‌మాదం సంభ‌వించింది. విజ‌య్ హెచ్చ‌రించినా.. కోర్ట్ ఆర్డ‌ర్ ను దిక్క‌రించి మ‌రీ ఈ క‌టౌట్‌ని కేర్‌లెస్‌గా వదిలేశారు. మ‌రి అభిమానుల‌కు విజ‌య్ ఎలాంటి క్లాస్ తీస్కుంటారో చూడాలి.