క్రేజీ బ‌యోపిక్స్‌పై 1000 కోట్ల పందేరం?

Tuesday, July 24th, 2018, 09:26:45 PM IST

ఉత్త‌రాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్నిచోట్లా బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల జోరు మ‌రింత‌గా ఉంది. ఇటీవ‌లే రిలీజైన రాజీ, ప‌ర‌మాణు, సంజు, సూర్మ బ‌యోపిక్ కేట‌గిరీలోనే తెర‌కెక్కి రిలీజ‌య్యాయి. బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్నాయి. అక్ష‌య్ కుమార్ గోల్డ్ చిత్రం ఓ హాకీ ప్లేయ‌ర్ జీవిత‌క‌థ స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న‌దే. స్వాతంత్య్రం సాధించాక హాకీ క్రీడ‌లో తొలి విజ‌యం అందుకున్న భార‌త్ విక్ట‌రీని తెర‌పై చూపించ‌బోతున్నారు. ఇందులో తెల్లోడి దుర‌హంకారాన్ని ఎలివేట్ చేయ‌నున్నారుట‌.

ఇదే గాక ప్ర‌స్తుతం మ‌రో మూడు బ‌యోపిక్‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవిత‌క‌థ‌తో కంగ‌న టైటిల్ పాత్రధారిగా తెర‌కెక్కిస్తున్న మ‌ణిక‌ర్ణిక‌, మ్యాథ‌మెటిషియ‌న్ ఆనంద్ కుమార్ జీవిత‌క‌థ‌తో హృతిక్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తున్న సూప‌ర్ 30, ఎంఎన్ఎస్ అధినాయ‌కుడు బాలా సాహెబ్ థాక్రే జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న థాక్రే చిత్రాలు త్వ‌ర‌లో క్రేజీగా రిలీజ్‌కి వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది రిప‌బ్లిక్ డే కానుక‌గా రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇవ‌న్నీ వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న‌వే. బాక్సాఫీస్ వ‌ద్ద ఇవ‌న్నీ క‌లిపి 1000 కోట్ల వ‌ర‌కూ బిజినెస్ చేస్తాయ‌న్న అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే బంప‌ర్ హిట్లు కొట్టి ఒక్కో సినిమా వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధిస్తాయ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments