అమెరికా ధ‌మాకా: 3సినిమాలు.. 60కోట్ల వ‌సూళ్లు

Tuesday, May 22nd, 2018, 09:23:43 PM IST

అమెరికా మ‌రో నైజాంగా మారిన క్ర‌మంలో నిర్మాత‌లు, ఓవ‌ర్సీస్ బ‌య్య‌రు జేబులు బాగానే నిండుతున్నాయి. ప‌నిలో ప‌నిగా టాలీవుడ్‌లో స‌క్సెస్ రేటు ఇదివ‌ర‌కటితో పోలిస్తే 5శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ప్ర‌స్తుతం వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో తెలుగు సినిమా వెలుగులు విర‌జిమ్ముతోంది. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, మ‌హాన‌టి చిత్రాలు ఇంటా బ‌య‌టా క‌లెక్ష‌న్ల దుమ్ము దులిపేశాయి. కేవ‌లం అమెరికానే కాదు.. అటు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లోనూ వ‌సూళ్ల‌లో త‌డాఖా చూపించాయి. ఆ క్ర‌మంలోనే తెలుగు సినిమా పురోగ‌తిపై ది గ్రేట్ ఫిలింక్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ప్ర‌త్యేకించి త‌న‌దైన రివ్యూను అందించారు.

“తెలుగు సినిమాల్లో సాలిడ్ కంటెంట్ బాక్సాఫీస్ విజ‌యానికి సాయ‌మ‌వుతోంది. ఇక‌పై హిందీ సినిమాకి తీవ్ర‌మైన పోటీ ఎదుర‌వుతోంద‌“ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వ్యాఖ్యానించారు. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, మ‌హాన‌టి చిత్రాలు అమెరికాలో 60కోట్లు (9 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేశాయని తెలిపారు. ఆస్ట్రేలియాలోనూ తెలుగు సినిమాల దూకుడు గురించి వివ‌రిస్తూ.. ఓపెనింగ్ వీకెండ్‌లో `భ‌ర‌త్ అనే నేను` ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వ‌ద్ద‌ నంబ‌ర్ 2 స్థానంలో నిల‌వ‌గా, `రంగ‌స్థ‌లం` నంబ‌ర్ 3 స్థానంలో నిలిచింది. ఇది గ్రేట్ మేకోవ‌ర్‌.. తెలుగు సినిమా ఓవ‌ర్సీస్‌లో అంత‌కంత‌కు ఎదుగుతోంది అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంత పెద్ద క్రిటిక్ మ‌న తెలుగు సినిమాని ఈ రేంజులో కీర్తించారంటే అది మునుముందు తెలుగోడి సత్తా ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై మ‌రింత‌గా నిరూపించుకునే ఛాన్సుంద‌నే ధీమా క‌న‌బ‌డుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments