బిగ్ న్యూస్: కుంభమేళా లో 30 మంది సాధువులకు సోకిన కరోనా

Friday, April 16th, 2021, 02:04:44 PM IST

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ రెండు లక్షలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వెయ్యికి పైగా కరోనా వైరస్ మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరుగుతున్న పవిత్ర కుంభమేళా లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఆ కుంభమేళా లో పాల్గొన్న 30 మంది సాధువులకు కరోనా వైరస్ సోకింది. అయితే ఇప్పుడు ఈ విషయం సర్వత్రా కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఆల్ ఇండియా అఖాడా పరిషత్ నాయకుడు అయిన మహంత్ నరేంద్ర గిరి కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. ఆయన ఇప్పుడు రిషేకేష్ లోని ఎయిమ్స్ లో చేరారు. అయితే ఇప్పటి వరకూ కూడా ముప్పై మందికి కరోనా వైరస్ సోకింది అని, అయితే ఈ కరోనా ఉదృతి కారణంగా నిరంజిని ఆఖాడా సాధువుల బృందం హరిద్వార్ ను వీడుతున్నట్లు తెలిపారు.