బిగ్ న్యూస్: తెలంగాణ లో 31 మంది డాక్టర్ లకు కరోనా పాజిటివ్!

Thursday, June 4th, 2020, 09:10:43 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ పెరుగుతోంది. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నే ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తెలంగాణ లో 31 మంది వైద్యులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో రాష్ట్రం లోని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. మిగతా ఆసుపత్రులలో కరోనా వైరస్ తీవ్రత ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు ఆసుపత్రులలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం తో , వాటిని ట్రాన్స్మిషన్ హాట్ స్పాట్ లుగా విభజిస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో ఎక్కువగా గాంధీ ఆసుపత్రి, నిమ్స్ మరియు ఎం జీ ఎం హెచ్ లలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కి కరోనా పాజిటివ్ గా నమోదు కావడం కలకలం రేపుతోంది.అయితే కొందరు ఉస్మానియా మెడికల్ విద్యార్థులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో వారితో ప్రైమరీ కాంటాక్ట్ కలిగి ఉన్న వారికి కూడా పాజిటివ్ పరీక్షలు నిర్వహింనున్నట్లు తెలుస్తోంది.

అయితే మిగతా విద్యార్థులు వారిని స్వీయ నియంత్రణ మార్గం ద్వారా క్వారంటైన్ లో ఉంచాలి అని, అలానే పరీక్షలు వాయిదా వేయాలని తెలిపారు. ఈటెల రాజేందర్ ఈ ఏడాది పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ కుతుంబీకులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వస్తుందనే నెపంతో విద్యార్థులు పీజీ నీ దాటి బయటికి వెళ్ళడం లేదు. అయితే వైద్యులకు కరోనా వైరస్ సోకడం పట్ల వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి దీని పై మున్ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.