35 ఏళ్ల‌లో 45 సినిమాల ప‌య‌నం

Thursday, May 31st, 2018, 05:22:43 PM IST

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ .. ఈ బ్యాన‌ర్ పేరు విన‌గానే రెండు క్రేజీ సినిమాలు గుర్తుకొస్తాయి. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన ఛాలెంజ్‌, స్వ‌యంకృషి చిత్రాలు గుర్తుకొస్తాయి. ఈ సినిమాలు ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ సినిమాలుగా అల‌రించాయి. అందుకే ఈ బ్యాన‌ర్‌కి, నిర్మాత కె.ఎస్.రామారావుకు మెగా నిర్మాత‌గా ప్ర‌త్యేక ఐడెంటిటీ ద‌క్కింది. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న పెద్దంత‌గా సినిమాల ప‌రంగా స్పీడ్ చూపించ‌క‌పోయినా.. అడ‌పాద‌డ‌పా సినిమాలు తీస్తూ నిర్మాత‌గా ఉనికిని చాటుతూనే ఉన్నారు. ఆయ‌న క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌లో 35 ఏళ్ల కెరీర్ ప‌య‌నంలో 45 సినిమాలు నిర్మించాన‌ని నేడు ఓ స‌మావేశంలో వెల్ల‌డించారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ సంస్థ‌లో తెర‌కెక్కుతున్న 45వ చిత్రం `తేజ్ ఐ ల‌వ్ యు`. సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌- అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ‌వుతోంది. రిలీజ్ సంద‌ర్భ ంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కెఎస్‌, క‌రుణాక‌ర‌న్ పాత్రికేయుల‌తో ముచ్చ‌టిస్తూ సినిమా సంగ‌తులు తెలిపారు.

కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ – “35 ఏళ్ల లో ఎన్నో అభిరుచిగ‌ల చిత్రాలు తీశాను. ఇందులో డ‌బ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఓ సాధార‌ణ ప్రేక్ష‌కుడిగా .. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమాలు తీయ‌డం నా ప‌ద్ధ‌తి. ఇప్పటివరకు 44 సినిమాలు నిర్మించాను. ఇందులో అనువాద‌ చిత్రాలూ వున్నాయి. తేజ్ నిర్మాత‌గా నా కెరీర్‌కి 45వ సినిమా. పుర‌స్కారాలు, స‌న్మానాల కంటే ఇత‌ర నిర్మాత‌లతో పోటీప‌డి వాళ్ల కంటే మంచి సినిమాలు తీయాల‌ని త‌ప‌న‌ప‌డ‌తాను. ఆ కోవ‌లోనే ఈ ప్ర‌య‌త్న ం. తేజ్ ఐ ల‌వ్ యు.. చ‌క్క‌ని లవ్‌, ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమా. ద్వ ంద్వార్థ సంభాష‌ణ‌లు ఉండ‌వు. సెన్సార్‌ కట్స్‌ లేకుండా కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని ఆహ్లాదంగా చిత్రీకరించారు. అగ్ర‌హీరోలే క‌రుణాక‌ర‌న్‌తో క‌నీసం ఒక సినిమా అయినా చేస్తే చాల‌ని భావిస్తుంటారు. నేను వాసు చిత్రం త‌ర‌వాత‌ అత‌డితో రెండో సినిమా చేస్తున్నా. వాసు చ‌క్క‌ని ప్రజాదరణ పొందింది. ఉత్తమ కుటుంబ‌ కథా చిత్రంగా నంది అవార్డుని గెలుచుకుంది.. అని తెలిపారు. 9వ తేదీని తేజ్ ఐ ల‌వ్ యు ఆడియోని రిలీజ్ చేసి, జూన్ చివ‌రిలో సినిమా రిలీజ్ చేస్తాం“ అని కెఎస్‌.రామారావు తెలిపారు. కెరీర్‌లో ప‌ద‌వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వ ం వ‌హిస్తున్నాన‌ని క‌రుణాక‌ర‌న్ వెల్ల‌డించారు. ఈ క్రేజీ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తుండ‌గా, ఆండ్రూ ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చిత్రీకరించార‌ని క‌రుణాక‌ర‌న్ వెల్ల‌డించారు.