నిజాం ఏలిన న‌గ‌రంలో 7-టాప్ బిలియ‌నీర్స్‌

Friday, September 30th, 2016, 12:23:19 PM IST

ramoji
దేశంలోని సంప‌న్నులున్న టాప్ -1 న‌గ‌రంగా ముంబై నీరాజ‌నాలు అందుకుంటుంటే .. నిజాం కొలువు దీరిన‌ హైద‌రాబాద్ టాప్ -4 సిటీగా పేరు తెచ్చుకుంది. దేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం అందుకుంది. ఈ సిటీలో ఏడుగురు బిలియనీర్లు ఉన్నారు.

1)అరబిందో ఫార్మా ప్రమోటర్లు నిత్యానంద రెడ్డి, రామచంద్రా రెడ్డి,
2)అమర్ రాజా బ్యాటరీస్ ప్రమోటర్ గల్లా రామచంద్ర నాయుడు,
3)దివీస్ ల్యాబ్స్ అధినేత మురళి దివి, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లో దివంగత అంజిరెడ్డి కుటుంబీకులు,
4)అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సి.ప్రతాప రెడ్డి

..మ‌రో మూడు పేర్లు బిలియ‌నీర్ల‌ జాబితాలో ఉన్నాయి.

*రామోజీ గ్రూపు- రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు, ఈటీవీ, కళాంజలి, మార్గదర్శి చిట్ ఫండ్స్, డాల్ఫిన్ హోటల్స్, ఉషాకిరణ్ మూవీస్ .. అలాగే రాష్ట్రానికే చెందిన నవయుగ గ్రూపు (సి.విశ్వేశ్వర రావు) సైతం కృష్ణపట్నం పోర్టు క‌లుపుకుని బిలియ‌న్ డాల‌ర్ కంపెనీల జాబితాలో నిలిచాయి.
* హైదరాబాద్ లో 8,200 మంది మిలియనీర్లు ఉన్నారు.
* నగరం మొత్తం సంపద సుమారు రూ.20.1 లక్షల కోట్లు (310 బిలియన్ డాలర్లు).
*ముంబై లో 4,500 మంది మిలియ‌నీర్లు, 28 మంది బిలియ‌నీర్లు ఉన్నారు. సిటీ సంప‌ద విలువ 53.3కోట్లు.
*ముంబై త‌ర్వాత‌ ఢిల్లీ, బెంగుళూరు, హైద‌రాబాద్ నగరాలు టాప్ -4 పొజిష‌న్‌లో చోటు ద‌క్కించుకున్నాయి.