ఏపీలో భారీగా నమోదైన కరోనా మరణాలు.. ఒక్కరోజే 43 మంది మృతి..!

Tuesday, July 14th, 2020, 03:14:19 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండగా, రెండు రోజుల నుంచి అదే స్థాయిలో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. తాజాగా నేడు 22,670 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,908 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో ఎనిమిది మందికి కరోనా సోకింది.

ఇదిలా ఉంటే నేడు కరోనా బారిన పడి ఏకంగా 43 మంది మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 33,019 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 15,144 మంది చికిత్స పొందుతుండగా, 17,467 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 408కి చేరింది.