4 పీఎం పూజా హెగ్డే ఏం త‌డాఖా చూపిస్తుందో?

Tuesday, March 27th, 2018, 02:52:39 PM IST

పూజా హెగ్డే `డీజే` చిత్రంలో 60 సెక‌న్ల‌ స్విమ్మింగ్ పూల్ సీన్‌తో గ‌డ‌గ‌డ‌లాడించింది. అంత‌కుమించిన గ్లింప్స్‌తో నేటి సాయంత్రం 4పీఎం దూసుకొస్తోంది.. చెక్ దిస్ డీటెయిల్స్…

`రంగ‌స్థ‌లం` ట్రైల‌ర్‌, పాట‌ల్లో రామ్‌చ‌ర‌ణ్ గ్లింప్స్‌.. స‌మంత గ్లింప్స్ చూశాం. చెర్రీ, స‌మంత‌ల‌కు అవార్డులు గ్యారెంటీ అని డిక్లేర్ అయ్యాం. గోదారి నేటివిటీతో అద్భుత‌మైన విజువ‌ల్స్‌ని సృజిస్తున్న సుకుమార్‌కు అవార్డులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలున్నాయి. ఆప‌ద్భాంద‌వుడు, అభిలాష వంటి నేటివిటీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న మెగాస్టార్‌ను జాతీయ అవార్డులు వ‌రించాయి అప్ప‌ట్లో. అందుకే ఇప్పుడు చెర్రీకి, చెర్రీ బృందానికి పెద్ద రేంజు అవార్డులు ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

రంగ‌స్థ‌లం రిలీజ్‌కి ఇంకో మూడు రోజులే స‌మ‌యం ఉంది. మార్చి 30న య‌థావిధిగా ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. అయితే మూణ్ణాళ్ల ముందు యూనిట్ మాస్ గుండెలు గుభేల్మ‌నే విజువ‌ల్స్‌ని వ‌దుల్తోంది. మ‌స్త్ మ‌స్త్ మ‌జా చేసే పూజా హెగ్డే ఐటెమ్ నంబ‌ర్‌ని బ‌రిలో దించుతోంది. పూజా అంద‌చందాల వ‌ల‌లకు ఏ రేంజులో అభిమానులను ఒడిసిప‌డ‌తాయో `డీజే`లో స్విమ్మింగ్ పూల్ బిట్ శాంపిల్‌గా భావించాలి. ఇప్పుడు అంత‌కుమించిన ఝ‌ల‌క్ పూజా `రంగ‌స్థ‌లం` స్పెష‌ల్‌ నంబ‌ర్‌లో ఇవ్వ‌బోతోంద‌న్న అంచ‌నాలున్నాయి. అందుకే 4పీఎం పూజాహెగ్డే గ్లింప్స్ అందుకోండి అంటూ .. ట్వీట్ చేశారు క్రిటిక్ ర‌మేష్ బాల‌. ఇంకో గంట‌లోనే పూజా గ్లింప్స్ గ్లింప్స్‌…