కోడ్ కూసే వేళ‌! ఐదు రాష్ట్రాల్లో మినీ సంగ్రామం!!

Wednesday, December 28th, 2016, 04:59:29 PM IST

election-commision-of-india
2017 మినీ మ‌హా సంగ్రామానికి తెర లేవ‌నుంది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. ఈనెల 30వ తేదీన ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఎన్నిక‌ల షెడ్యూల్‌ని ప్ర‌క‌టించ‌నుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 30వ తేదీన ఈసీ అధికారుల సమావేశానంత‌రం నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. ఎప్పుడైతే ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుందో అప్ప‌టినుంచే కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంది. అలాగే ఎన్నిక‌లొస్తే భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌కు సంబంధించిన అంశాల‌పైనా ఇప్ప‌టికే అధికారుల్లో చ‌ర్చ మొద‌లైంది. 21 రోజుల ప్ర‌చార స‌మ‌యం.. ఆపై నామినేష‌న్ల‌కు రెండు వారాల గ‌డువు ఉండేలా తేదీల్ని సెట్ చేస్తున్నారు. దేశ రాజ‌కీయాల‌కు, ప్రధాని మోదీకి ప్రజల్లో వున్న ఆదరణకు .. పెద్ద నోట్ల ర‌ద్దు క‌రెక్టా కాదా? అనే దానికి రెఫరెండంగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని భావిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments