వీడియో : 50ల‌క్ష‌ల మంది వీక్షించిన గ్రేట్ డ్యాన్స్‌

Friday, March 16th, 2018, 06:44:04 PM IST

కొన్ని డ్యాన్సులు క‌ళ్ల‌కు మిరుమిట్టు గొలుపుతాయి. అద్భుతం.. అసాధార‌ణం .. న‌భూతోన‌భ‌విష్య‌తి అనిపించే రేంజులో డ్యాన్సులు చేస్తూ న‌వ‌త‌రం ట్యాలెంట్ క‌ట్టి ప‌డేస్తున్న తీరు మెచ్చాల్సిందే. ప్ర‌ముఖ టీవీ చానెళ్ల లైవ్‌లో యువ‌ట్యాలెంట్ త‌మ డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌ను ఎలివేట్ చేసుకునేందుకు అద్భుత‌మైన ఛాలెంజెస్‌తో వ‌స్తున్నారు. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తోంది అలాంటి ఓ గ్రేట్ డ్యాన్సింగ్ ఫీట్‌.

ఇటీవ‌లే హోలీ రోజు ఓ ప్ర‌ముఖ హిందీ చానెల్లో లైవ్ అయిన డ్యాన్సింగ్ ఫీట్ యూట్యూబ్‌లో అసాధార‌ణ‌మైన వ్యూస్‌తో దూసుకుపోతోంది. శిల్పాశెట్టి, సాజిద్ ఖాన్ , కొరియోగ్రాఫ‌ర్‌ గీతా క‌పూర్ జ‌డ్జిలుగా చేస్తున్న‌`సూప‌ర్ డ్యాన్స‌ర్ 2` కార్య‌క్ర‌మంలోని ఈ స్కేటింగ్ డ్యాన్స్ ఫీట్ అబ్బుర‌ప‌రుస్తోంది. కుచ్ బి – వీడియోస్ పేరుతో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వేగంగానే వైర‌ల్ అయిపోయింది. ఇప్ప‌టికే 51ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఇంకా ఇంకా ఆద‌ర‌ణ పొందుతూనే ఉంది. జ‌డ్జీల‌తో క‌లిసి రాణీముఖ‌ర్జీ స‌ద‌రు డ్యాన్సింగ్ ట్యాలెంటును ఓ రేంజులోనే పొగిడేసింది. ఇదిగో ఈ రేర్ ట్యాలెంటును మీరు కూడా వీక్షించి తీరాలి.