నెస్‌వాడియాకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న ప్రీతి జింతా!

Thursday, February 22nd, 2018, 12:30:54 AM IST

ఐపీఎల్ వ్యాపారంలో సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి ప్రీతిజింతా భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ నెస్లే య‌జ‌మాని నెస్‌వాడియాతో క‌లిసి ఐపీఎల్ క్రికెట్లో పెట్టుబ‌డులు పెట్టింది. అయితే ఎక్క‌డ చెడిందో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా లావాదేవీల్లో తేడాలు రావ‌డంతో 2014లో పెద్ద గొడ‌వ జ‌రిగింది. నెస్ వాడియా క్రికెట్ స్టేడియంలోనే ప్రీతిజింతాపై చెయ్యి చేసుకోవ‌డం.. బూతులు తిట్ట‌డం సంచ‌ల‌న‌మైంది. ఆ క్ర‌మంలోనే ప్రీతి జింతా, త‌న భ‌ర్త జీన్ గుడెన‌ఫ్ తో క‌లిసి పోలీస్ కేసు పెట్టింది.

అయితే ఆ కేసు అప్ప‌టినుంచి విచార‌ణ ద‌శ‌లోనే ఉంది. నెస్‌వాడియాపై పోలీసులు ద‌ర్యాప్తు సాగిస్తూనే ఉన్నారు. నేటితో అత‌డిపై అన్నిర‌కాల సాక్ష్యాధారాలు సేక‌రించి .. ప‌లువురిని విచారించి చివ‌రికి 500 పేజీల‌ ఛార్జ్‌షీట్‌ దాఖ‌లు చేశారు. ప్రీతిజింతాపై నెస్ మూడు సార్లు గ్రౌండ్‌లోనే చెయ్యి చేసుకున్నాడు. ప్రీతి చేతిపై గాయాలకు ఫోటో ఆధారాలున్నాయి. ప్రీతి కేసు పెట్టాక‌… అప్ప‌ట్లో 20వేల పూచీక‌త్తుతో నెస్‌వాడియాని పోలీసులు విడిచిపెట్టారు. కానీ ఇన్నాళ్టికి ఇన్వెస్టిగేష‌న్ పూర్త‌యి, ఛార్జ్‌షీట్ రెడీ అయ్యింది. మునుముందు కోర్టుల ప‌రిధిలో విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి ప్రీతిజింతా నెస్‌కి జింతాత చేస్తోంది.