50కోట్ల వార్! మెగాస్టార్ మ‌రో గ్లాడియేట‌ర్?

Sunday, September 16th, 2018, 12:29:45 PM IST

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రాలు `300`, `ట్రాయ్‌`, `గ్లాడియేట‌ర్‌` స్ఫూర్తితో హాలీవుడ్‌లో ఎన్నో వార్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తెర‌కెక్కాయి. అయితే ఆ స్థాయిలో మ‌ళ్లీ యుద్ధ స‌న్నివేశాల్ని చూపించ‌లేక‌పోయారు. భారీ యుద్ధ స‌న్నివేశాల‌కు ల్యాండ్ మార్క్ సినిమాలుగా అల‌రించాయి ఇవ‌న్నీ. ఆయా సినిమాల్లో వార్ ఎపిసోడ్ స‌న్నివేశాలు వాటిలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. యుద్ధం అంటే ఇదీ! అన్నంత ఉద్రేకం క‌లుగుతుంది ఆడియెన్‌కి. ఆ సినిమాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ అంతే ఆక‌ట్టుకున్నాయి.

ఆ స్థాయిలో సినిమాలు భార‌త‌దేశంలో మునుపెన్న‌డూ రాలేదు. చాలా కాలానికి `బాహుబ‌లి` సిరీస్‌తో రాజ‌మౌళి ఆ ప్ర‌య‌త్నం చేశారు. తెలుగువారి క‌ల‌ను నెర‌వేర్చ‌గ‌లిగారు. బాహుబ‌లి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో త‌ల‌మానికంగా నిలిచింది. పూర్తిగా హాలీవుడ్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుని రాజ‌మౌళి అసాధార‌ణ ప్ర‌య‌త్నం చేసి విజ‌యం అందుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మ‌న ఫిలింమేక‌ర్స్ ర‌గిలిపోతున్నారు. బాహుబ‌లిని కొట్టే సినిమాలు తీయాల‌న్న ప‌ట్టుద‌ల‌, పంతం పెరిగాయి. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న `సైరా-న‌ర‌సింహారెడ్డి`ని కొణిదెల కాంపౌండ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ సినిమాని వారియ‌ర్ క‌థ‌తో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇందులో వ‌చ్చే ఒక్కో యుద్ధ స‌న్నివేశం క‌ళ్ల‌ను మిరుమిట్లు గొలిపేలా చిత్రీక‌రించేందుకు ఏమాత్రం వెన‌కాడ‌కుండా డ‌బ్బును మంచినీళ్ల‌లా పోయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ప్ర‌స్తుతం సైరా టీమ్ జార్జియా వెళ్లింది. అక్క‌డ భారీ యుద్ధ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. యుద్ధ స‌న్నివేశం అంటేనే వేలాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు అవ‌స‌రం. అలానే గుర్రాలు, ఏనుగులు, ఆయుధాలు ఒక‌టేమిటి భారీ స‌రంజామా కావాలి. వీట‌న్నిటినీ భారీ కోట‌ల సెట్‌లు ఉన్న చోట చిత్రీక‌రించాలి. ఆ సెట‌ప్ మొత్తం జార్జియాలో త‌క్కువ ఖ‌ర్చుకే రెడీగా ఉంటుంది. అందుకే ఇదివ‌ర‌కూ క్రిష్ `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` చిత్రాన్ని అక్క‌డ తెర‌కెక్కించారు. ఇప్పుడు సైరా వార్ ఎపిసోడ్స్‌ని జార్జియాలో తెర‌కెక్కించ‌నున్నారు. ఇందుకోసం ఏకంగా 50 కోట్ల బ‌డ్జెట్‌ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ వార్ ఎపిసోడ్ హాలీవుడ్ లెవ‌ల్లో చిత్రీక‌రించ‌నున్నారు. డిసెంబ‌ర్ నాటికి టాకీ పూర్తి చేస్తారు. సైమ‌ల్టేనియ‌స్‌గా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసి, స‌మ్మ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments