ఈ ఖాన్ మ‌హా గ‌ట్టోడు సుమీ!

Friday, March 16th, 2018, 12:20:20 AM IST

లిప్‌లాక్‌కి వ‌యసుతో ప‌నేంటి? అయినా ప్రేమ‌కు వ‌య‌సేంటి? మ‌న‌సుండాలే కానీ.. ఎన‌ర్జీ ఉండాలే కానీ రోమాంచిత‌మైన జీవితానికి ఎండింగ్ అనేదే లేద‌ని వాత్సాయ‌నుడు కామ‌సూత్రాల్లో చెప్పాడు. ఇదిగో ఇక్క‌డ 53 వ‌య‌సాయ‌న.. 23 యువ‌కుడిలా ఏ రేంజులో ముద్దు పెట్టేశాడో చూశారా? అస‌లు ఈ ఛాయాచిత్రం చూస్తేనే షాక‌వ్వాల్సి వ‌స్తోంది.

53 వ‌య‌సులో అడుగుపెట్టిన‌ అమీర్‌ఖాన్ నిన్న‌టిరోజున అట్ట‌హాసంగా త‌న‌ పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. బ‌ర్త్‌డే వేళ త‌న త‌ల్లి అయిన జీన‌త్ హుస్సేన్ పోటోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్‌ చేయ‌డం సంచ‌లన‌మైంది. అటుపై అత‌డు ర‌క‌ర‌కాల చోట్ల పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకున్నాడు. భార్య కిర‌ణ్‌రావు- పిల్ల‌ల స‌మక్షంలో అమీర్ పుట్టిన‌రోజు కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేష‌న్స్ అద‌ర‌గొట్టేశాడు. ఇక అదే వేడుక‌లో కేక్ తిన్న త‌ర్వాత ఆ ఇద్ద‌రూ లిప్ లాక్ వేయ‌డం చూప‌రుల‌కు షాకిచ్చింది. ప్ర‌స్తుతం అమీర్ -కిర‌ణ్ లిప్ లాక్ అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతోంది. లేటు వ‌య‌సు ఘాటు ముద్దు అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నా.. ఎంతో రొమాంటిక్ గా ఉందంటూ వ్యాఖ్యానించే అభిమానులు ఉన్నారు. ఇది ఆ ఇద్ద‌రి జీవితంలో రేర్ మూవ్‌మెంట్‌. రేర్ ఫోటో అనే చెప్పాలి. `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తు చేస్తూ 20 ప్ల‌స్ హీరోలానే క‌నిపిస్తున్నాడు. ఈ ఖాన్ మ‌హా గ‌ట్టోడు సుమీ!