బిగ్ డిసీషన్: ఏపీలో కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు..!

Friday, October 16th, 2020, 07:22:33 PM IST

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీసీ కులాల జనాభా ప్రాతిపదికన అత్యధిక కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ కార్పోరేషన్లను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ఏ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పోరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. అయితే జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమించబోతున్నారని, ఈ నెల 18న ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్లకు ఛైర్మన్లను నియమించనున్నట్టు సమాచారం.