2017 నేషనల్ అవార్డ్స్.. బెస్ట్ సినిమా ఏదంటే..

Friday, April 13th, 2018, 03:41:31 PM IST

బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ఆధ్వర్యంలో ఈ రోజు 65వ జాతీయ అవార్డుల ప్రకటన చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2017 తెలుగు తమిళ్ అలాగే హిందీ కన్నడ మలయాళ భాషలకు సంబందించిన మంచి చిత్రాలకు అవార్డులను ప్రకటించారు.మే 3న ఈ అవార్డుల ప్రధానోత్సం జరుగుతుంది. ఇకపోతే జ్యూరీ సభ్యులుగా అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, నటి గౌతమి, గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే మరియు ఇంతియాజ్‌ హుస్సేన్‌ ఉన్నారు.

ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2

ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్ ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి
ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం)

ఉత్తమ నటుడు: రిద్ధీ సేన్‌(నగర్‌ కీర్తన్‌-బెంగాలీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు:బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా

  •  
  •  
  •  
  •  

Comments