హైదరాబాద్ సిగలో మరో కీలక భవనం..ముందుకొచ్చిన చైనా

Sunday, August 25th, 2019, 05:36:40 PM IST

ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అగ్ర సంస్థలు అన్ని తమ కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండాలని కోరుకుంటున్నాయి. ఇండియాలోనే మరి ముఖ్యంగా దక్షిణాదిన ఎక్కువ వనరులు, తక్కువ ఖర్చు ఉండేది ఒక్క హైదరాబాద్ లోనే అందుకే అందరి చూపులు భాగ్యనగరంపై పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే యుఎస్ఎ తర్వాత తమ మొట్ట మొదటి కార్యాలయాన్ని హైదరాబాద్ లోనే నిర్మించింది.

తాజాగా చైనాకి చెందిన ఒక నిర్మాణ సంస్థ హైదరాబాద్ లో 4 ఎకరాల విస్తీరణంలో 66 అంతస్తుల భారీ భవనం నిర్మించాలని ముందుకి వచ్చింది. స్థానికంగా ఒక నిర్మాణ సంస్థతో కలిసి దీనిని నిర్మిస్తుంది. ఇందుకు అనుమతి కావాలని GHMC కి కోరటం జరిగింది. ఇప్పటికి హైదరాబాద్ లో 40 అంతస్తులే ఎక్కవ, అలాంటిది ఏకంగా 66 అంతస్తుల భవనం అంతే మాములు విషయం కాదు. ఈ బిల్డింగ్ మొత్తం వాణిజ్య కార్యకలాపాలకు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది.

దాదాపు 1800 కోట్లు ఖర్చుతో కోకాపేటలో దీనిని నిర్మిస్తున్నారు. ఈ భారీ భవనంలో పెద్ద పెద్ద హోటల్స్, ప్రపంచస్థాయి షాపింగ్ మాల్స్, సర్వీసు అపార్ట్ మెంట్లు.. స్విమ్మింగ్ పూల్.. క్లబ్ హౌస్.. పది అంతస్తుల్లో స్టార్ హోటల్ లాంటివి నిర్మిస్తారు. అలాగే బిల్డింగ్ లోని 63 అంతస్తులో హైదరాబాద్ మహా నగరాన్ని చూడటానికి వీలుగా ఒక వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే మహా నగరానికి మరింత శోభ రావటం ఖాయం.