ప్రమాదం: తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి!

Friday, October 30th, 2020, 11:48:47 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో నేడు ఉదయం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హజరై, సొంత గ్రామాలకు చేరుకొనే మార్గము లో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడటం తో అందులోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన గోకవరం లో చోటు చేసుకుంది. తాటికొండ వేంకటేశ్వర స్వామి ఆలయం లో గురువారం రాత్రి ఒక వివాహం జరిగింది. అయితే వివాహం పూర్తి అయిన అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులు, బందువులు 22 మంది తిరుగు ప్రయాణం అయ్యారు.

అయితే వాహనం బ్రేకులు సరిగ్గా పడకపోవడం తో వ్యాన్ అదుపు తప్పి, మెట్ల మార్గం ద్వారా కొండ కిందకి బోల్తా పడింది. అయితే అక్కడికక్కడే అయిదుగురు మృతి చెందగా, ఆసుపత్రికి తరలించెప్పుడు మరో ఇద్దరు మృతి చెందారు. అయితే తీవ్ర గాయాల భారిన పడిన కొందరిని అక్కడి రాజమండ్రి లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.