జెస్సీ ఖాతాలో 70 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్‌

Thursday, September 6th, 2018, 02:54:35 PM IST

జెస్సీగా అంద‌రి మ‌న‌సు దోచి, అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య భార్య అయ్యింది స‌మంత‌. అక్కినేని కోడ‌లుగా అభిమానుల గౌర‌వం అందుకుంది. స‌మంత క్రేజు పెళ్లి త‌ర్వాత అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. మునుముందు తెలంగాణలో తేరాస ప్ర‌భుత్వం త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉంద‌న్న ప్ర‌చారం ఉంది. అదంతా స‌రే సామాజిక మాధ్య‌మాల్లో స‌మంత ఫాలోవ‌ర్స్ లెవ‌ల్ ఏ రేంజులో ఉందో తెలుసా? తెలిస్తే షాక్ తినాల్సిందే.

సామ్‌కు ట్విట్ట‌ర్‌లో ఏకంగా 70ల‌క్ష‌ల (7మిలియ‌న్స్‌) మంది అనుచ‌రులు ఉన్నారు. నిరంత‌రం ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాలో అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్‌ప్రైజెస్ ఇవ్వ‌డంతో ఇంత‌మంది ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో స‌మంత‌ను అనుస‌రిస్తున్నారు. మునుముందు కోటి మంది త‌న‌ని అనుస‌రించ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. సామ్ న‌టించిన రంగ‌స్థ‌లం, అభిమ‌న్యుడు, మ‌హాన‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌. సీమ‌రాజా, యూట‌ర్న్ సెప్టెంబ‌ర్ 13న ఒకేసారి రిలీజ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఫ్యాన్స్‌లో దీనిగురించే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments