28 కిలోల బంగారం చెప్పుల్లోపెట్టి.. బాబోయ్..!

Friday, January 20th, 2017, 05:48:15 PM IST

gold-sleppers
రోజురోజుకి బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. పోలీస్ ల నిఘా నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు విన్నూత్న విధానాలను అనుసరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం పట్టుబడింది.స్మగ్లర్లు పాదరక్షల్లో బంగారాన్ని తరలిస్తున్న వైనానికి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. 28 కిలోల బంగారం పాదరక్షల్లో దాచిపెట్టి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

తరలిస్తున్న బంగారం విలువ రూ. 8.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది స్మగ్లర్లు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా దీనివెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. 8 మంది నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు విచారణకు తరలించారు.కాగా బుధవారం కూడా ఢిల్లీ విమానాశ్రయంలో ఇదేవిధంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. పాద రక్షల అడుగు భాగంలో బంగారం కడ్డీలను అతికించి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.