బిగ్ అలర్ట్ : హైదరాబాద్‌లో 8 హైరిస్క్ ప్రాంతాలు ఇవే..!

Monday, July 13th, 2020, 11:20:51 AM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే హైదరాబాద్‌ మరియు గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో ఈ ప్రాంతాలలో కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచారు.

అయితే టెస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్ది కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో అధికారులు ఈ ప్రాంతాలలో మళ్ళీ కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. 500కుపైగా కేసులున్న 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించారు. యూసఫ్‌గూడ, అంబర్‌పేట్, మెహిదీపట్నం, కార్వాన్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ సర్కిళ్లను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకోనునట్టు సమాచారం.