పార్టీ ఫిరాయించే టీడీపీ MLA లు లిస్ట్ ఇదే..?

Friday, June 14th, 2019, 10:48:02 AM IST

అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను గేట్లు తెరిస్తే టీడీపీని ఖాళీ చేసి మా పార్టీలోకి రావటానికి చాలా మంది MLA లు మాతో టచ్ లో ఉన్నారు. ఎంత మంది ఉన్నారో కౌంట్ చెప్పటం లేదు. దానికి మీరు సంతోషించండి అంటూ చెప్పుకొచ్చాడు.. జగన్ నుండి అలాంటి మాటలు రావటంతో అసెంబ్లీ లోనే కాదు, బయటకూడా వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఎంత మంది పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు అంటూ ఆరాలు తీస్తున్నారు. మనకి వస్తున్నా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 8 మంది టీడీపీ MLA లు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది..

గంట శ్రీనివాస రావు ( వైజాగ్ నార్త్ ) ,అనగాని సత్య ప్రసాద్ (రేపల్లె ) బాల వీరాంజనేయ స్వామి (కొండెపి ) గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి) రామరాజు మంతెన (ఉండీ) వేగుళ్ల జోగేశ్వర రావు (మండపేట ) రామకృష్ణ బాబు వెలగపూడి (వైజాగ్ ఈస్ట్ ) బండారు మాధవ నాయుడు (పాలకొల్లు ) పైన చెప్పిన వీళ్ళందరూ వైస్సార్సీపీ పార్టీ లోని కొందరితో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

వీళ్ళలో కొందరు గతంలో వివిధ పార్టీలో చేసి టీడీపీ లోకి వలస వచ్చిన వాళ్ళు కావటం విశేషం. ఇక టీడీపీని విడిచి వైస్సార్సీపీ లోకి వెళ్లాలని అనుకుంటున్నా వాళ్ళ లిస్ట్ కూడా చంద్రబాబు దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని మందలించటం కంటే కూడా బుజ్జిగించటమే బెటర్ అనే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తుంది.. కానీ బాబు ఎంత బుజ్జగించిన కానీ, జగన్ సైగ చేస్తే వెళ్లిపోవటానికి రెడీగా ఉన్నారు..