నవ్వడానికి సిద్దమవ్వండి…ఈ సినిమాలో 80 మంది కమీడియన్లు

Thursday, April 19th, 2018, 09:08:29 AM IST

సాధారణంగా కామెడీ సినిమాల్లో ఇద్దరు లేక ముగ్గురు కమీడియన్లు ప్రేక్షకులను నవ్విస్తూ అలరించడం చూసాం మహా అయితే పోసాని కృష్ణ మురళి నటించిన శ్రావణ మాసం సినిమలో నవరత్నాలు అంటూ 9 మంది కమీడియన్లు హాస్యం పండించడం చూసాం. కానీ ఇక్క డ వీటన్నిటికంటే ఇంకాస్త డిఫరెంట్ గా ట్రై చేసారు అదెలా అనుకుంటున్నారా..? తాజాగా ఇప్పుడు ఓ చిత్రంలో 80 మంది హ‌స్య‌న‌టులు క‌లిసి సంద‌డి చేశారు. రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హస్య చిత్రం ‘ఊ.పె.కు.హ అంటే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి’.

ఈ సినిమాలో 80 మంది హాస్య నటులు కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైపోతున్నారు. నిధి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. భాగ్యలక్ష్మి నిర్మాత. ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మనందం, ఆలీ, కృష్ణుడు, ఋషి, హేమంత్, శ్రీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ తదితర హాస్య నటులు న‌టించారు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments