అదిరింద‌య్యా జ‌గ‌న్‌….బోణి బాగుంది!

Tuesday, June 11th, 2019, 07:44:37 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి తొలి బోణీ అదిరింది. ఏపీ అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తాన‌న‌ని, అర్హులంద‌రికి ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీని ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చ‌డం మొద‌లుపెట్టారు. తొలి ప్ర‌య‌త్నంలోనే 2 వేల 500 కోట్ల పెట్టుబ‌డుల్ని రాబ‌ట్టిన వైఎస్ జ‌గ‌న్ 900 ఉద్యోగాల్ని సృష్టించడంతో వైఎస్ జ‌గ‌న్ బోణీ అదిరింది అంటున్నారు. స్థానిక ఉద్యోగాల క‌ల్ప‌ణ‌లో భాగంగా అల్ట్రాటెక్‌ సిమెంట్ ఇండ‌స్ట్రీస్ తో ఏపీ ప్రుత్వం తాజాగా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 2వేల 500కోట్ల భారీ ప్రాజెక్ట్‌ను అల్ట్రాటెక్‌ సిమెంట్ ఇండ‌స్ట్రీస్ ఏపీలో ప్రారంభించ‌బోతోంది. ఏపీ ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి ల‌భించ‌డంతో క‌ర్నూల్‌లోని పెట్నికోటె గ్రామంలో ఈ ప‌రిశ్ర‌మ‌ను స్థాపించ‌బోతున్నారు.

దీని ద్వారా 900 మంది ల‌బ్దిపొంద‌బోతున్నారు. ఈ ఫ్యాక్ట‌రీ ద్వారా 900 మందికి ఉద్యోగావ‌కాశాలు క‌లగ‌బోతున్నాయి. ఏపీ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అన్ని ర‌కాల అనుమ‌తులు ఇవ్వ‌డంతో ఏపీలో జ‌గ‌న్ ఏసీఎ అయిన త‌రువాత ఏపీలో ప్రారంభం కాబోతున్న తొలి భారీ ప‌రిశ్ర‌మ‌గా దీన్ని చెబుతున్నారు. జ‌గ‌న్ ఆరంభం అదిరింద‌ని, దీంతో ఉద్యోగాల క‌ల్పిణ‌తో పాటు రాష్ట్రానికి మంచి గుడ్ విల్ వున్న కంపెనీని తీసుకొచ్చార‌ని ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు మొద‌లుపెట్టారు. ప్ర‌శంస‌ల‌కు పొంగిపోకుండా వైఎస్ జ‌గ‌న్ త‌దుప‌రి ప్రణాళిక‌పై దృష్టిపెట్టి మ‌రిన్ని ప్రాజెక్టులు ఏపీకి త‌ర‌లించ‌డంలో కీల‌క పాత్ర పోషించాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.