దారుణ ప్రయత్నం : 5 నెలల బిడ్డను బ్యాగ్ లో పెట్టి కిడ్నాప్!

Monday, September 16th, 2019, 01:26:22 PM IST

మనం ప్రతీ రోజు ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం.కానీ ఒక వార్త లేదా నివ్వెరపోయే సంఘఠన దగ్గర మాత్రం ఒక్కసారిగా స్థంభించిపోతాం.అలాంటి దారుణ ఘటనలు ఇప్పటికే ఎన్నో చూసి ఉంటాం మనం.ఇప్పుడు మళ్ళీ అలాంటి దారుణమైన ఘటన దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకుంది.దుబాయ్ నుంచి పాకిస్థాన్ లోని కరాచీకి వెళ్లే ఒక వ్యక్తి తాలూకా ట్రావెల్ బ్యాగ్ ను అక్కడి ఎయిర్ పోర్ట్ సిబ్బంది తనిఖీ చెయ్యగా అందులో కేవలం 5 నెలల పసికందును చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఆ బిడ్డను కిడ్నాప్ చేసి పాకిస్థాన్ కు తీసుకెళ్తున్నట్టుగా వారు నిర్ధారించారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అలాగే ఈ వార్త విన్నటువంటి ప్రతీ ఒక్కరు విస్మయానికి గురువవుతున్నారు.ఆ వీడియోను కింద చూడండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి