అదరగొడుతున్న త్రివిక్రమ్ అ..ఆ సినిమా..!

Monday, September 10th, 2018, 06:34:23 PM IST

అదేంటి అ ఆ సినిమా కొత్తగా అదరగొట్టడం ఏంటి ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది కదా..? మళ్ళీ కొత్తగా అదరగొట్టడం ఎం ఉంది అనుకుంటున్నారా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 లో విడుదల అయ్యి అద్భుత విజయం సాధించిన సంగతి మీ అందరికి తెలిసినదే.. నితిన్ యొక్క కెరీర్ లో కూడా ఈ చిత్రం ఒక మైలు రాయిగా నిచిపోయింది, అంతే కాకుండా నితిన్ అన్ని సినిమాల కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే అనడం లో ఎలాంటి సందేహం లేదు..

మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ సినిమా చేసినది ఎం ఉందబ్బా అనుకుంటున్నారా..? ఈ సినిమాని ఇటీవలే హిందీ వెర్షన్ ని రెండు వారల క్రితం యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అనూహ్యంగా ఇప్పటికి దాదాపు యాభై రెండు లక్షల మంది వీక్షించారు. ఇది కూడా ఒక రికార్డు గానే చెప్పుకోవచ్చు.. ఎందుకంటే నితిన్ తో పోలిస్తే మన స్టార్ హీరోల సినిమాలు కూడా కొన్ని హిందీ లో యూట్యూబ్ లో విడుదల చేశారు కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత అనూహ్య స్పందన రాలేదు. కొంత మంది స్టార్ హీరోలకే సాధ్యం కానీ ఫీట్ నే నితిన్ సంపాదించాడు అనే చెప్పాలి. ఇది త్రివిక్రమ్ మ్యాజిక్ అని కూడా చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments