చంద్రబాబు సభలో చేదు అనుభవం – సభలో పడ్డారు

Saturday, November 9th, 2019, 02:40:44 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సభలో నేడు ఒక వింతైన అనుభవం చోటు చేసుకుంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన సభను నిర్వహిస్తుంటే… మరొకవైపు సభకు వచ్చిన వారిలో దొంగలు పడ్డారు. కాగా సభకు హాజరైన దొంగలు పాపం చాలా కస్టపడి, తమ చేతి వాటాన్ని ప్రదర్శించి సుమారు 20 మంది పర్సులు, మొబైల్ ఫోన్లు కొట్టేశారు. కాగా ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా చిత్తూరు జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ, వైసీపీ బాధితులను కలుస్తూ, రాబోయే ఎన్నికలకు తన క్యాడర్ ని సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

కాగా చంద్రబాబు నిర్వహించిన ఈ సమావేశాలకు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే అక్కడికి హాజరైనటువంటి కార్యకర్తల కి సంబందించిన పర్సులు, ఫోన్లు, అన్ని దొంగలింపబడ్డాయి. కాగా ఈ తతంగమంతా కూడా అక్కడున్న ఒక్క సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అవ్వకపోవడం అనేది విశేషం. ఇక చేసేదేమి లేక పోలీసులు కూడా సైలెంట్ గానే ఉండిపోయారు.