మంత్రితో పాటు ఆ 24 మంది అరెస్ట్ కాక‌త‌ప్ప‌దా?

Wednesday, June 5th, 2019, 07:55:13 AM IST

త‌లాపాపం తిలా పిడికెడు అన్న‌ట్టు ఏపీ రాజ‌ధాని పేరుతో టీడీపీ పార్టీ నాయ‌కులు ఆడింది ఆట పాడింది పాట‌గా త‌యారైంది. ముందు నుంచే ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాజ‌ధాని విష‌యంలో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని చెబుతున్న‌ట్టే టీడీపీ లీల‌లు ఒక్కోటి బ‌య‌ట‌ప‌డుతున్నాయి. సీఆర్‌డీఏ ప‌రిధిలో జ‌రిగిన భూ లావాదేవీల‌పై అధికార ప‌క్షం స‌మ‌గ్ర స‌మాచారం తెచ్చించుకోగా క‌ళ్లు బైర్లుక‌మ్మే నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయని తెలుస్తోంది. ఆరుగురు మంత్రులు, 12 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 24 మంది టీడీపీ నేత‌లు ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన‌ట్టు తేలింది.

ఈ 24 మంది రాజ‌ధాని ఎక్క‌డ ఏర్పాటు చేయ‌బోతున్నారో మందే తెలుసుకుని అక్క‌డ అత్యంత త‌క్కువ ధ‌ర‌కు భూముల్ని కొనుగోలు చేసి రైతుల్ని మోసం చేశార‌ని తేలింది. ఇందులో ముఖ్యంగా ఓ మంత్రి చ‌క్రం తిప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏ క్ష‌ణాన్నైనా ఆ మంత్రిని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరెస్టు చేసే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ అధికారంలో వుండ‌గా స‌ద‌రు మంత్రి తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ప్ర‌జ‌ల సొమ్ము కోట్లు చేతులు మారిన‌ట్లు బ‌ట్ట‌బ‌య‌లైంది. దీంతో ఈ అంశాన్ని అత్యంత సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించి ఈ అంశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌ర‌కు తీసుకెళ్ల‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.