భారీ అవినీతికి తెరలేపిన వైసీపీ..వాలంటీర్లు ఉద్యోగాలే టార్గెట్

Friday, June 14th, 2019, 10:40:59 PM IST

అవినీతికి ఆమడ దూరంలో ఉండి పనిచేస్తాం. ఎక్కడ అవినీతి జరిగినట్లు అనిపించినా వాళ్ళమీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాటికోసమే సచివాలయంలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామంటూ మాట్లాడిన జగన్, ఇప్పుడు తెరవెనుక భారీ అవినీతి కుట్రకి తెరలేపినట్లు తెలుస్తుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి, 50 ఇళ్ళకి ఒక్కో వాలంటీర్ ని నియమించి ప్రభుత్వ పధకాలు వాళ్ళకి నేరుగా అందేలా చేస్తామని చెప్పి, వాలంటీర్ల జాబ్ కోసం అధికారిక ప్రకటన ఇచ్చి, దరఖాస్తు చేసుకోమని చెప్పారు, కానీ క్షేత్ర స్థాయిలో చుస్తే మాత్రం ఆ పోస్ట్ లు మొత్తం కేవలం వైస్సార్సీపీ సానుభూతి పరులకే వచ్చేలా చేస్తున్నారు.

ఈ విషయం స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పటం విశేషం. గ్రామంలోని మన కార్యకర్తలకి ఎలా న్యాయం చేయాలో మాకు తెలుసు. ఆ పోస్టులు అన్ని మనవాళ్లకే వచ్చేలా చేస్తానంటూ హామీలు ఇస్తున్నాడు. అక్కడ అర్హత కలిగిన అందరు అప్లై చేసిన కానీ, అందులో వైసీపీ వాళ్ళకే ఆ పోస్ట్ లు వస్తాయనేది పచ్చి నిజం. కేవలం వాళ్ళ కార్యకర్తలకే జాబ్స్ ఇవ్వలని అనుకుంటే డైరెక్ట్ గా ఇచ్చుకుంటే బాగుంటుంది, అలా కాకుండా ప్రభుత్వ స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి, దాని ద్వారా ఇలా అక్రమాలు చేయటం కరెక్ట్ కాదు. కొందరు అనొచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చింది కదా కార్యకర్తలకి న్యాయం చేయాలి కదా, అందుకే ఇలా చేస్తున్నారని, నిజమే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. అది ఎదో పార్టీ తరుపున చేసుకుంటే బాగుంటుంది కదా.

గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు అంటూ పెట్టాడు, కానీ దానికి ఇలా నోటిఫికేషన్ లాంటివి ఇవ్వలేదు. తన పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నాడు, ఆ తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించాడు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వ మూసుకులో జాబ్ అంటూ చెప్పి కేవలం తన వాళ్ళకే వచ్చేలా చేసుకుంటూ, అసలైన అవినీతికి తెరలేపాడు. ప్రభుత్వ పధకాలు ప్రజలకి అందటంలో ఆలస్యం అవుతుంది, అక్కడే అక్రమాలు జరుగుతున్నాయని చెపుతూ, వాటికీ చెక్ పెట్టటానికే గ్రామా వాలంటీర్లు అంటూ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఈ గ్రామ వాలంటీర్లు విషయంలోనే అక్రమాలకు తెరలేపింది.