జనసేనానికి పెద్ద షాక్ : నమ్మిన ఆప్తుడే దెబ్బేసాడుగా…?

Friday, December 13th, 2019, 10:49:24 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కి నమ్మిన ఆప్తుడు రాజు రవితేజ శుక్రవారం నాడు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. కాగా జనసేన పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేసిన ఆయన, నేడు పార్టీ కి రాజీనామా చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తన రాజీనామాని పవన్ కళ్యాణ్ ఆమోదిస్తున్నట్లు సామజిక మాంద్యమాల ద్వారా ప్రకటించారు. ఈమేరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్… జనసేన పార్టీ పట్ల తన అంకిత భావాన్ని గౌరవిస్తున్నాని చెప్పిన పవన్ కళ్యాణ్… గతంలో కూడా ఇలాగె పార్టీనుండి వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలోకి వచ్చారని వెల్లడించారు.

కాగా జనసేన పార్టీ ప్రారంభించడానికి ఒక రకంగా రాజు రవితేజ తన వంతు ప్రేరణ ఇచ్చారని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగానే ప్రకటించారు. అయితే జనసేన పార్టీ ప్రారంభించినప్పటినుండి కూడా పార్టీలో నమ్మకంగా ఉన్న ఆయన, పవనిజం అనే పుస్తకాన్ని కూడా రాసారు. అయితే పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడిలాగా పూజించే ఆయన, ఇప్పుడు పవన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ, ఇక పవన్ రాజకీయాలకు పనికి రాడంటూ తన లేఖ ద్వారా వెల్లడించారు.