సమగ్ర విశ్లేషణ : పవన్ విషయంలో ఏ గతీ లేకనే వైసీపీ ఇలా చేస్తుందా??

Wednesday, December 4th, 2019, 02:55:00 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లు గెలిచిన టీడీపీ పార్టీను వదిలేసి పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యిపోయి కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న జనసేన పార్టీను అలాగే పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుండడం ఏపీ రాజకీయాల్లో కాస్త ఆసక్తికరంగా మారింది.టీడీపీ కంటే తీవ్ర స్థాయిలో ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీను వైసీపీ ఇంతలా కాన్సన్ ట్రేట్ చేస్తుండడంతో రాష్ట్ర ప్రజలు కూడా అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం టీడీపీయా లేక జనసేనా అన్న మాటలు మాట్లాడుకుంటున్నారు.

అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా పవన్ వల్ల తమకు ముప్పు ఉంటుంది అని వైసీపీ భావిస్తుందో ఏమో కానీ అసలు పవన్ ఒక్క మాట అనడం భయం వైసీపీలో కీలక నేతలే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒక రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు.అయితే అసలు వీరు పవన్ విషయంలో చేస్తున్న విమర్శలు పదే పదే రాష్ట్ర ప్రజలపై రుద్దేవిలాగానే కనిపిస్తున్నాయి.అలాగే ఇక పవన్ పై ఎలాంటి గత్యంతరం లేక ఈ విమర్శలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఎక్కువవుతున్నాయి.అసలు పవన్ ను వారు ఇంతలా టార్గెట్ చెయ్యడం ఎందుకు?వారికి అంత అవసరమా?పవన్ కు రాజకీయాలే తెలీదు అంటారు.

ఒక్క సీటు మాత్రమే వచ్చింది అని హేళన చేస్తారు.రెండు చోట్ల ఓడిపోయావు ప్రజలు నిన్ను పొర్లు దండాలు పెట్టించి మరీ కొట్టారు అని వీళ్ళే అంటారు.అలాంటి వ్యక్తిని ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అంటే వారి నుంచి సరైన సమాధానం లేకపోగా మనః”సాక్షి” అంటారు.ఇలా పవన్ విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒకింత అనుమానం కలగట్లేదా..?ముఖ్యంగా అయితే పవన్ విషయంలో వైసీపీ నుంచి ప్రధానంగా వినిపించే రాజకీయ విమర్శలు కాదు విమర్శ పవన్ చంద్రబాబు పార్ట్నర్స్ అని.

పవన్ చంద్రబాబు డైరెక్షన్ లో మాట్లాడుతాడు ప్యాకేజీ తీసుకున్నాడు.బాబుకి కాల్షీట్ లు ఇచ్చాడు ఇలా ఎంతసేపు పవన్ ను చంద్రబాబుకు అంటగట్టడం తప్ప వీరి నుంచి మరో రాజకీయ విమర్శ రావడం లేదు.అలాగే తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నాని అన్న మాటలైతే మరీ విడ్డూరంగా ఉన్నాయి.పవన్ ని జైల్లో వేస్తారన్న భయంతో అమిత్ షాను పొగుడుతున్నారట.అసలు ఈ కామెంట్స్ దగ్గరే వైసీపీ పవన్ విషయంలో తేలిపోయింది అని చెప్పొచ్చు.అసలు పవన్ జైలుకు వెళ్లడం ఏమిటి?అతనేమన్న రాజకీయాల్లోకి వచ్చి అక్రమంగా కోట్లు పోగేసుకొని ప్రజలను మోసం చేసాడా అని జనసేన శ్రేణులు అంటున్నారు.

ఇక్కడే వైసీపీ పవన్ విషయంలో దుష్ప్రచారం చెయ్యడానికి చంద్రబాబుతో అక్రమ సంబంధం పెట్టడం తప్ప మరో బలమైన దారి కనిపించడం లేదా అని అర్ధం అవుతుంది.ఇదైతే జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది పవన్ దెబ్బ తిన్నాడు.మరి వీరిద్దరూ కలిసే ఉన్నట్టయితే మనఃసాక్షి లాంటి మాటలు మాట్లాడకుండా అధికారంలో ఉండి ఎందుకు కనీసం నిరూపించే ప్రయత్నం చెయ్యకుండా కాల క్షేపం చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచించాలి.సరే పవన్ ఏదో ఆశించి బీజేపీపై సానుకూలంగా మాట్లాడారు అనుకుందాం.

మరి మోడీ విషయంలో జగన్ చేస్తుంది ఏమిటి తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడులా ఇప్పుడు మోడీపై అసలు నోరే ఎత్తలేకపోతున్నారు.ఒకవేళ నోరెత్తితే తర్వాత రిపీట్ అయ్యే సీన్ ఎలా ఉంటుందో కూడా వైసీపీ నేతలకు తెలుసు మరి అలాంటాప్పుడు పవన్ పై ఇలాంటి విమర్శలు చెయ్యడం తగునా..?అన్నది వారు ఓ సారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.అలాగే మొన్న తిరుపతి సభలో పవన్ ఓ పాయింట్ లేవనెత్తారు.తాను టీడీపీకి బి టీం అయితే వైసీపీ టీడీపీ 60-40 రాజకీయాలు చేస్తున్నట్టుగా మాటలు మాట్లాడారు.

అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ బాలికను 2017లో అత్యాచారం చేసి హతమారిస్తే అప్పుడు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు సరే మరి ఇప్పుడు మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు.టీడీపీపై అంతెత్తున ఎగసి పడతారు కదా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నేతలపై ఇపుడు అధికారంలో ఉన్న మీరెందుకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు?దీనిని బట్టి ఎవరు ఎవరిని కాపాడుతున్నారు అని అన్న మాటలు ఎందుకో వైసీపీ టీడీపీ రాజకీయాలను “భరత్ అనే నేను” సినిమాలోని ఓ సీన్ ను గుర్తుకు తెచ్చింది.

వీరు అధికారంలో ఉన్నపుడు వాళ్ళని వారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని కాపాడుకోడం ఒక ప్రాసెస్ లా ఉంటుందని అంటారు.మరి ఇప్పుడు వైసీపీ ఎందుకు ఆ కేసు విషయంలో చర్యలు తీసుకోకుండా అప్పటి టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తుందో కూడా ప్రజలు ఆలోచించాలి.ఇలాంటివి అన్ని అడుగుతున్నాడనే బహుశా పవన్ ను బాబుకు అంటగట్టారు.

ఎందుకంటే పవన్ పై వైసీపీ నేతలకు రాజకీయంగా ఎదుర్కోడానికి ఎలాంటి విమర్శలు దొరకడం లేదు.మరి ఏం చెయ్యాలి?ఇలాంటి విమర్శలే చెయ్యాలి.ఇప్పటికే చేసారు సక్సెస్ అయ్యారు.అదే కొనసాగిస్తున్నారు.అది కాదని పవన్ ను జైల్లో పెడతారు అంటే వీరి విమర్శలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి.ఇకనుంచి అయినా పవన్ విషయంలో వ్యక్తిగత విమర్శలు ఎంతసేపు రుద్దుడు విమర్శలు కాకుండా వేరే ప్లాన్స్ ఏమన్నా వేస్తే బెటర్.