కేసీఆర్ కథ ముగుస్తుందా..? మారుతున్నా పరిస్థితులు

Wednesday, September 18th, 2019, 01:19:03 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తీరు ఇప్పుడు చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కప్పుడు తన మాటే శాసనంగా ఉండాలని అనుకునే కేసీఆర్. ఇప్పుడు ప్రతి దానికి సంజాయిషి ఇచ్చుకోవలసి వస్తుంది. ఒక్కప్పుడు వివరణ అంటే నచ్చని నాయకుడు ఇప్పడూ ఏకంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందంటే అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లే అని అనుకోవచ్చు.

ఎప్పుడైతే ఒక నాయకుడికి అతని విశ్వాసం సన్నగిల్లుతుందో అతను మానసికంగా బలహీనపడినట్లే, మానసికంగా బలహీనపడితే అతను ఓటమి అంచుకి చేరినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. కేసీఆర్ విషయానికి వస్తే మొన్న బడ్జెట్ సమావేశంలో స్వయంగా ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టి , ఆర్థిక పరిస్థితి గురించి వివరించి చెప్పి, దానికి కారణం బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు అని విడమర్చి చెప్పాడు.

అలాగే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం గురించి కూడా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు కేసీఆర్. గతంలో తెలంగాణ విమోచన దినం అంటేనే అది ఒకటి ఉందా..? అన్నట్లు చూసే కేసీఆర్ నోటి నుండి ఆ కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు అనే దాని గురించి వివరణ రావటం నిజం ఆశ్చర్యం. అలాగే మేము దానిమీద ఎలాంటి ఆంక్షలు విధించేది లేదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే జరుపుకోవచ్చు అంటూ కేసీఆర్ ప్రకటించటం చూస్తే తీరులో వచ్చిన మార్పు సృష్టంగా కనిపిస్తుంది.