జాక్ పాట్‌: స‌న్నీతో డేటింగ్‌కి వెళ్లాల‌నుకుంటున్నారా?

Monday, October 16th, 2017, 10:12:16 AM IST

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న క్రేజు ఎలాంటిదో తెలిసిందే. తెలుగునాట ఈ అమ్మ‌డికి విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ `గ‌రుడ‌వేగ‌`లో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించింది స‌న్నీ. ఈ ప్రత్యేక గీతం యూత్‌కి గుబులు పుట్టిస్తుంద‌ని యూనిట్ ప్ర‌చారం చేస్తోంది. అదంతా స‌రే .. ప్ర‌స్తుతం స‌న్నీ ఎక్క‌డ ఉంది అంటే లాస్ ఏంజెల్స్‌లో సెల‌బ్రేష‌న్స్ మూడ్లో ఉందిట‌.

స‌న్నీ విదేశీ ట్రిప్‌లో ఉండ‌గానే.. ఇక్క‌డ శిల్పా శెట్టి ఓ అదిరిపోయే ప్లాన్ వేసింది. త‌న పేరిట ఉన్న శిల్పా శెట్టి ఫౌండేష‌న్‌కి నిధులు సేక‌రించేందుకు `ఆంటీ బోలి ల‌గావో బోలి`.. అంటూ త‌న వెబ్‌సైట్లో ప్ర‌చారం ప్రారంభించింది. ఆంటీ బోలి ల‌గావో బోలి.. స‌న్నీలియోన్ ఆంటీతో డేట్‌కి వెళ్లే అరుదైన ఛాన్స్‌.. మిస్ చేసుకోకండి.. అంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తోంది. స‌న్నీని క‌లుసుకునే ఈ అరుదైన అవ‌కాశం కోసం బోయ్స్ విచ్చేస్తార‌ని, త‌ద్వారా విరాళాలు సేక‌రించ‌డం సులువు అవుతుంద‌ని శిల్పాశెట్టి, హ‌బ్బీ రాజ్‌కుంద్రా భావించారుట‌. ఈ ఐడియాని రాజ్ కుంద్రానే శిల్పాకి ఇచ్చారుట‌. స‌న్నీని క‌లుసుకునేందుకు కుర్రాళ్లంతా ఉవ్విళ్లూరుతుంటారు. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటార‌ని రాజ్ కుంద్రా చెబుతున్నాడు. మొత్తానికి స‌న్నీని ఇలా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని స‌ద‌రు బిజినెస్‌మేన్ మాబాగానే చెప్పాడండోయ్‌!!