మాస్క్ ధరించమని చెప్పినందుకు సహోద్యోగి పై ఇనుప రాడ్ తో చితకబాదిన వ్యక్తి!

Tuesday, June 30th, 2020, 02:11:01 PM IST

కళ్ళముందు దారుణం జరుగుతున్న కొందరు పట్టి పట్టనట్లుగా చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం హోటల్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. మాస్క్ ధరించమని చెప్పినందుకు ఒక వికలంగురాలిను సహోద్యోగి ఇనుప రాడ్ తీసుకొని ఇష్టానుసారం గా చితకబాదాడు. అయితే ఇందుకు సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీటీవీ లో రికార్డ్ అయింది.

మాస్క్ ధరించమని అడిగినందుకు ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆ మహిళల మీదికి దూసుకు పోయాడు. అక్కడ ఆ మహిళను చితక బడటడం తో అక్కడి ఉన్న వారు సైతం చూస్తూ నిలబడ్డారు. కొందరు అపితున్నప్పటికి అతను కొట్టడం మాత్రం ఆపలేదు. అయితే ఇలా ప్రవర్తించినందుకు గానూ అతని పై చట్ట పరమైన చర్యలు తీసుకున్నారు అధికారులు. ఐపిసి 354,355,325 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అతని పై పోలీస్ చర్యలు తీసుకొని జుడిషియల్ రిమాండ్ కి తరలించారు. అంతేకాక ఆడవారి పై ఇలాంటి చర్యలు తీసుకున్నందుకు వారిని శిక్షిస్తామని నెల్లూరు పోలీస్ తెలిపారు. ఆడవాళ్ళ భద్రత వారి మొదటి ప్రాధాన్యత అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన విషయం లో అతని పై వెంటనే తగిన చర్యలు తీసుకునందుకు డీజీ ఆంధ్ర ప్రదేశ్ ఎస్పీ భాస్కర్ భూషణ్ ను మరియు నెల్లూరు పోలీస్ లను అభినందించింది. అంతేకాక అతని పై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి, వారం లోగా చార్జీ షీట్ ఇవ్వాలని ఎస్పీ నీ డీజీ కోరడం జరిగింది.

రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ కేసులు సైతం రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మేరకు మాస్క్ లేనిదే బయటికి వచ్చేందుకు వేలు లేదు. మాస్క్ ధరించమని చెబుతున్నా ఏ ఒకరు కూడా పట్టించుకోవడం లేదు. అయితే నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.