బిగ్ బ్రేకింగ్ : రాపాక అరెస్ట్ కు రంగం సిద్ధమయ్యిందా?జనసేనానిపై ఒత్తిడి!

Tuesday, August 13th, 2019, 11:10:07 AM IST

ఇప్పుడు జనసేన పార్టీలో కల్లోలం చెలరేగుతుంది.పవన్ ఎందుకు ఇంకా స్పందించడం లేదని పార్టీ అభిమానులే పవన్ ను ప్రశ్నిస్తున్నారు.ఇటీవలే జనసేన పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే విషయంలో మలికిపురం ఎస్సై వ్యవహరించిన తీరుతో ఆ పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది.ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ దుర్భాషలాడడం ఏమిటని జనసేన శ్రేణులు మరియు రాపాక అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలతో నిరసన చేపట్టారు.

అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా రాపాక వర ప్రసాద్ పై కుట్ర పూరితంగానే జరుగుతుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా వైసీపీ మంత్రులు సూచనల మేరకు ఇప్పుడు రాపాకను మరియు మరో 200 మంది జనసైనికులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయని అసలు ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా ఎలాంటి స్పందన చూపించకపోవడం ఏమిటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

తన పార్టీకు సంబంధించిన వ్యక్తుల మీదనే ఏమన్నా జరిగితే రోడ్ల మీదకు వస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే మీదకే పెద్ద సమస్య వస్తున్నపుడు కూడా పవన్ ఇలా ఉన్నారేంటి అని ప్రశ్నలు కురిపిస్తున్నారు.ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే ఈయన విషయంలో కూడ పవన్ ఇంకా మౌనంగా ఉన్నారంటే ఏదన్నా పెద్ద కారణమే ఉందా లేక కావాలనే మౌనంగా ఉన్నారా అన్నది పవన్ స్పందిస్తే తప్ప తెలిసేలా లేదు.మొత్తానికి ఇప్పుడైతే మాత్రం పవన్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది.