బిగ్ బ్రేకింగ్ : వైసీపీలో నెంబర్ 2 కోసం ఓ కీలక నేత పేరు.?

Friday, July 12th, 2019, 07:04:23 AM IST

ఈ దఫా జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో భారీ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా అంత గొప్ప విజయాన్ని అందుకున్న వై ఎస్ జగన్ పాత్ర ఆ పార్టీలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటిదో అందరికి తెలుసు.వై ఎస్ మరణాంతరం ఒక సరికొత్త పార్టీను స్థాపించి తాను ఒక్కడై ముందుకు నడిపించారు జగన్.ఎలాగో ఆ పార్టీకు సంబంధించి జగనే నెంబర్ 1 అని అందరికి తెలుసు.కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జగన్ తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2స్థానం ఆ పార్టీకు చెందిన కీలక నేత పేరు వినిపిస్తుంది అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక సరికొత్త వార్తలు వినిపిస్తున్నాయి.

వైసీపీ పార్టీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారి పేర్లు అంటే మొదటగా విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తుంది.కానీ అతని పేరు కాకుండా వైసీపీలో నెంబర్ 2 స్థానానికి ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రోజా పేరు వినిపిస్తోందట.రోజా పేరు బాగా ఆ మధ్య అంతా వినిపించింది అని ఓ వర్గం మీడియా ఇప్పుడు ప్రచారం చేస్తుంది.గత కొన్ని రోజుల క్రితమే మంత్రి పదవుల విషయంలో కూడా రోజా పేరు బలంగా వినిపించడంతో ఏకంగా ఆ పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఆమే సరైన వారు అని అంతా అనుకున్నారని అంటున్నారు.మరి సరికొత్తగా ఈ నెంబర్ 2 అంటూ ప్రచారం చేస్తుండడం వెనక మన పైడ్ మీడియా మతలబు ఏమన్నా ఉందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు రాకుండా మానవు.