వైరల్ న్యూస్ : పసి ప్రాయం ముందు తలొంచిన త్రాచు..!

Thursday, February 27th, 2020, 11:35:32 AM IST

మనిషికి జ్ఞ్యానం అనేది ఎంత ఉపయోగకరమో అంతే స్థాయిలో అపాయాన్ని కూడా కలిగిస్తుంది.అయితే మనిషి పుట్టాక తన ఎదుగుదలతో పాటుగా ఆ జ్ఞ్యానం అనేది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది.అలాంటి పసి ప్రాయంలో పసి పిల్లలు తెలిసీ తెలియక చేసే ప్రతీ పని చాలా అందంగా అనిపిస్తుంది.అందుకే ఏమో పసి పిల్లలను దైవంతో సమానంగా మనుషులు కొలుస్తారు.అయితే అదే విధంగా అలాంటి అమాయకత్వం దయాగుణం లేనటువంటి ఎన్నో విషపూరిత క్రూర జంతువులు కూడా ఈ సృష్టిలో ఉన్నాయి.

అయినప్పటికీ అలాంటి క్రూరత్వాన్ని పసి ప్రాయపు అమాయకత్వం జయించింది అని ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సరిగ్గా ఏడాది కూడా నిండి ఉండని ఓ పసి బిడ్డ తనకి తెలియకుండానే తన ముందు ఎంత ఆపద ఉందో అర్ధం కాని వయసులో ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఒక నల్ల త్రాచు పాము ముంగిట కూర్చొని దానిని పట్టుకొని అటు ఇటు ఊపుతుంది.మొదట దాని ప్రవర్తన కాస్త ఘాటుగా ప్రవర్తించినా మరి దానికి ఏమర్థం అయ్యిందో ఏమో కానీ ఆ పసి పిల్లాడిని ఏమి అనడం మానేసింది.ఇపుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.