వైరల్ న్యూస్ : బంగారంతో కరోనా మాస్క్ చేయించిన ఘనుడు..ఎంత ఖర్చుతో తెలుసా.?

Saturday, July 4th, 2020, 01:33:51 PM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా కరోనా దెబ్బకు అనేక మార్పులు వచ్చేసాయి. దీనితో ప్రతీ ఒక్కరు సామాజిక దూరంతో పాటుగా మాస్కులు వినియోగించడం చేతులు శుభ్రంగా కడుక్కోవడం మూలాన కరోనా బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచించారు. దీనితో మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా మెల్లగా మనవాళ్ళు అలవాటు చేసుకున్నారు.

మొహానికి మస్కు లేనిదే వారు బయటకు రావడం లేదు. దీనితో ఈ మాస్కులకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇదంతా సాధారణ విషయమే కానీ పూణే కి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఈ మాస్క్ పై అమిత ప్రేమ పెంచుకున్నాడో ఏమో కానీ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో కరోనా మాస్క్ వేసుకొని కనిపించి ఆశ్చర్య పరిచాడు. పూణే పింపిరి ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఏకంగా 2.9 లక్షల రూపాయలు పెట్టి ఈ మాస్క్ చేయించుకున్నాడట. ఇప్పుడు ఇతడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.