ఆర్టీసీ కార్మికుల సరికొత్త ప్లాన్ – షాక్ లో కెసిఆర్

Saturday, October 19th, 2019, 09:15:25 PM IST

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నేడు (అక్టోబర్ 19) ఆర్టీసీ కార్మికులు తలపెట్టినటువంటి రాష్ట్ర బంద్ కార్యక్రమం విజయవంతం అయిందని భావించిన కార్మికులందరూ కూడా ఇకపై తమ భవిష్యత్తు కార్యాచరణపై ద్రుష్టి సారించారని సమాచారం. ఇకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రానికి సంబందించిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరిని కలుసుకొని, తమ సమ్మె కు మద్దతు పలకాలని కోరనున్నారని సమాచారం. ఇకపోతే ఆర్టీసీ కార్మికుల వేతనాలు రాణి కారణంగా వారు పడే బాధలని ప్రతినిధులకు వెల్లడించనున్నారని సమాచారం.

కాగా తెరాస తో పొత్తు లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నేతలైన అసదుద్దీన్ ఒవైసీ లేదా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలుసుకొని, వారికి తమ మద్దతును పలకాలని కోరనున్నట్లు సమాచారం. ఈంరకు ఉస్మానియా యూనివర్సిటీ లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి పూనుకున్నారని సమాచారం. ఇకపోతే నేటి బంద్ లో భాగంగా పోలిసుల కారణంగా తీవ్రంగా గాయపడినటువంటి సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావును జేఏసీ నేతలు కలుసుకోనున్నారు. ఇకపోతే ఈనెల 20 న ప్రధాన కూడళ్లలో ప్రజలకు పుష్ప గుంచం అందించి కృతఙ్ఞతలు తెలుపుకోనున్నారు.