ఆస్కార్‌లో ఆర్ఆర్‌ విజేత‌ను ఎంపిక చేసేది ఎవ‌రు?

Sunday, February 4th, 2018, 11:28:09 PM IST

మార్చిలో అస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ఆస్కార్‌ల కోసం ప‌లు క్రేజీ చిత్రాలు పోటీప‌డుతున్నాయి. వీటిలో క్రిస్టోఫ‌ర్ నోలాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డ‌న్‌కిర్క్ స‌హా ప‌లు క్రేజీ చిత్రాలు ఉన్నాయి. డ‌న్‌కిర్క్ ఏకంగా ఎనిమిది విభాగాల్లో ఆస్కార్‌ల‌కు పోటీప‌డుతోంది. అలాగే ఫాంట‌మ్ థ్రెడ్ అనే వేరొక సినిమా ఐదారు విభాగాల్లో పోటీప‌డుతోంది. షేప్ ఆప్ వాట‌ర్ అనే చిత్రం ఆరు విభాగాల్లో పోటీప‌డుతోంది. 24 శాఖ‌ల్లో ప‌లు క్రేజీ చిత్రాలు విభిన్న కేట‌గిరీల్లో పోటీప‌డుతున్నాయి. అయితే వీటిలో ప‌లు చిత్రాలు రీరికార్డింగ్‌, సంగీతం విభాగంలో అవార్డుల కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాయి.

వీటిలో నోలాన్ డ‌న్‌కిర్క్‌, షేప్ ఆఫ్ వాట‌ర్‌, ఫాంట‌మ్ థ్రెడ్‌, స్టార్ వార్స్ లాస్ట్ జేడీ, త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇవ‌న్నీ ఆర్‌.ఆర్‌. బేస్డ్ సినిమాలు. వీటినుంచి బెస్ట్ ఏది? అన్న‌ది ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఆస్కార్ క‌మిటీలో మ‌న‌వాడైన ఏ.ఆర్‌.రెహ‌మాన్ రీరికార్డింగ్ మ్యూజిక్ విభాగంలో ఉండి ఎంపిక‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈనెల 28న లాస్ ఏంజెల్స్ ఫ‌ఙ‌లార్మ‌నిక్ కాన్సెర్ట్‌లోనూ రెహ‌మాన్ పాల్గొంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న వాల్ట్ డిస్నీ కాన్సెర్ట్ హాల్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.ఇదే కార్య‌క్ర‌మంలో సంగీతం తో భ‌యం, సంతోషం, ఎమోష‌న్ ఎలా క్రియేట్ చేయ‌వ‌చ్చో రెహ‌మాన్ వివ‌రించ‌నున్నారు. `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌` చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న భార‌తీయ సంగీత దిగ్గ‌జం ఏ.ఆర్.రెహ‌మాన్‌కి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డం భార‌తీయులు హ‌ర్షించ‌ద‌గిన‌దే. రెహ‌మాన్‌తో పాటు లైవ్ కాన్సెర్టులో టాన్ డ‌న్, క్విన్సీ జోన్స్‌, మికా లేవి, రాచెల్, పోర్ట్మాన్ వంటి సంగీత దిగ్గ‌జాలు పాల్గొంటున్నారు.