చిరుని ప్రశ్నించే హక్కు వాళ్లకి లేదు..సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న పోస్ట్!

Thursday, February 27th, 2020, 10:13:28 AM IST

ప్రముఖ సినీ నటుడు మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి చిరంజీవి మళ్ళీ తన సినిమాల్లో బిజీ అయ్యిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.అలాగే ఆయన మనసులో మళ్ళీ రాజకీయాలలోకి రావాలని నిజంగా ఉందో లేదో ఆయనకే తెలియాలి కానీ రాజకీయ పరంగా మాత్రం తనపై సోషల్ మీడియాలో రచ్చ మాత్రం ఆగడం లేదు.గత కొన్ని రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు జగన్ చిరుకు రాజ్య సభ స్థానం ఇవ్వబోతున్నారని వార్తలు కొనసాగుతూనే ఉన్న ఈ నేపథ్యంలో సరికొత్త వార్త చిరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

దీనితో ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ చిరు పై జరుగుతున్న ప్రచారం ఏమిటంటే రాజధానిగా అమరావతే కొనసాగాలని దానికి చిరు మద్దతు ప్రకటించాలని అలా చేసేంత వరకు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న చిరు ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తామని జేఏసీ సభ్యులు తెలుపుతున్నారు.వచ్చే ఫిబ్రవరి 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేసి చిరును డిమాండ్ చెయ్యాలని పూనుకున్నారు.

దీనితో ఈ ప్రకటన విన్న మెగాభిమానులు వారికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.అసలు ఇప్పుడు రాజకీయాల్లో లేని చిరంజీవిని ప్రశ్నించే హక్కే మీకు లేదని ఏ చిరును మాత్రమే అడగడానికి నోరు వస్తుంది కానీ గత అధికార పార్టీ మరియు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హీరో బాలకృష్ణను ఎందుకు డిమాండ్ చెయ్యరని ఆయన ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేసే దమ్ము మీకుందా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి మాత్రం ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం రేపుతోంది.