టి సిఎం వ్యాఖ్యలపై విచారణ కమిటీ

Friday, September 12th, 2014, 06:20:29 PM IST


కెసిఆర్ వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించింది. కెసిఆర్ వరంగల్ లో మాట్లాడిన మాటలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేస్తున్నట్టు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కేండేయ కట్జు ఈ రోజు ఢిల్లీలో వెల్లడించారు. ఈ త్రిసభ్య సభ్యుల కమిటీ కన్వీనర్ గా రాజీవ్ రంజన్ నాగ్ వ్యవహరించనున్నారు. కృష్ణప్రసాద్, అమర్ నాథ్ లు సభ్యులుగా వ్యవహరిస్తారు..15 రోజులలో నివేదికను అందించాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కమిటీని ఆదేశించారు.