జగన్ గెలుపు పై విష ప్రచారం ఇంకా ఆగలేదు.!

Sunday, June 9th, 2019, 06:35:31 PM IST

ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా 151 స్థానాల్లో గెలుపొందడం అనేది చాలా వరకు ఆ పార్టీ శ్రేణులకే ఒకరకంగా ఊహలకు అందని అంచనా.ఎన్నో రకాల పెద్ద పెద్ద సర్వేలలో కూడా అత్యధికంగా అయితే 120 కు మించి స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని ఎవ్వరు చెప్పలేదు.అలాంటిది వైసీపీకి ఏకంగా 151 స్థానాలు గెలుచుకుంది అంటే అది కాస్త అనుమానించదగ్గ విషయమే అని చాలా మంది అనుకున్నారు.ఇక్కడ వైసీపీ అయితే జాతీయ స్థాయిలో మాత్రం మోడీ సర్కార్ కూడా ఇదే తరహా ప్రభంజనం సృష్టించారు.ఒకరకంగా చూసుకున్నట్టయితే ఈ ఇద్దరికి ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకున్నారు.

మరి ఇది ఎవరి తీర్పో తెలీదు కానీ ఈ ఇద్దరికీ మాత్రం అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం లేదని ఈ అన్నిటి అసలు రహస్యం ఒక 120 మంది ఐఏఎస్ అధికారులకు తెలుసనీ సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి వాట్సాప్ లో ఒక మెసేజ్ కలకలం రేపుతోంది.ఈ మెసేజ్ ప్రకారం వైసీపీ కేవలం గెలుచుకునేది 60 స్థానాలు మాత్రమే అని అలాగే బీజేపీ గెలుచుకున్న 300 కు పైగా స్థానాల్లో మొత్తం 220 సీట్లలో ఈవీఎం టాంపరింగ్ జరిగిందని వైసీపీ విషయంలో మొత్తం 90 సీట్లలో టాంపరింగ్ జరిగిందని ఈ సంచలన విషయానికి సంబంధించి పక్కా ఆధారాలు మమతా బెనర్జీ మరియు రాహుల్ గాంధీ సహా మరో 120 మంది ఐఏఎస్ అధికారుల దగ్గర ఉన్నాయని వీరంతా కలిసి అతి త్వరలోనే సుప్రీం కోర్టులో నిజాన్ని బయటపెట్టనున్నారని ఓ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది.ఈ వార్తలో ఎంత వరకు నిజముందో కానీ ఒకరకంగా నమ్మశక్యం అయ్యే విధంగానూ లేనట్టుగానే అనిపిస్తుందని ఈ వార్త విన్న నెటిజన్స్ అంటున్నారు.అయితే టెక్నికల్ పరంగా ఈవీఎం టాంపరింగ్ జరగడం అసాధ్యమని ఈ ఇద్దరి గెలుపును జీర్ణించుకోలేని ఇతర పార్టీల నేతలు కావాలనే ఇలా అసత్య ప్రచారాన్ని జరుపుతున్నారని వైసీపీ మరియు బీజేపీ శ్రేణులు బలంగా చెప్తున్నాయి.