రెచ్చిపోయిన ప్రేమోన్మాది – యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు…

Monday, February 10th, 2020, 10:08:32 PM IST

ఒకవైపు ఎక్కడ చూసినా కానీ యువతులకు అండగా ఉండేందుకు ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రేమోన్మాదులు, మృగాలు మాత్రం ఎక్కడా మారినట్లు కనిపించడం లేదని చెప్పాలి ఇలాంటి తరుణంలో కరీంనగర్ లో మరొక దారుణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని పై ఒక ప్రేమోన్మాది దారుణంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. కాగా కరీంనగర్ పట్టణంలోని లోని విద్యానగర్ ప్రాంతంలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాగా మృతురాలు కరీంనగర్ లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న రాధికగా గుర్తించారు.

అయితే గత కొంత కాలంగా రాధిక అనే యువతిని ప్రేమిస్తున్నానని వెంటబడుతున్న ఆ యువకుడు, ఎంతకీ రాధిక ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన ఆటను, రాధిక ని తన ఇంట్లోనే గొంతు కోసి చంపేశాడు. కాగా పనులు తన తల్లిదండ్రులు సాయంత్రానికి తమ పనులను ముగించుకొని తమ ఇంటికి వెళ్లొచ్చేసరికి రాధికా అలా రక్తపు మడుగుల్లో పది ఉండటం చూసి తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి నిందితుడు పరారీలో ఉన్నాడు.