బికినీ వేస్తె … బూతు సినిమాల్లో నటించినట్టా ?

Thursday, November 10th, 2016, 11:18:08 AM IST

aaliya
ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ .. బికినీలు వేసుకోవడం అన్నది కామన్ గా మారిపోయింది. బికినిలో హాట్ హాట్ ఫోజులిచ్చి .. షాక్ ఇవ్వడమే కాదు .. సోషల్ మీడియా లో పోస్ట్ చేసి .. దుమ్ము రేపుతున్నారు !! అయితే వాళ్ళు బికినీ వేసిన ఫోటోలపై నెటిజన్స్ కామెంట్స్ చేయడం కూడా అంతే సాధారణం అయింది? స్విమ్ షూట్స్ వేసుకుని పోజులిస్తే … నెటిజన్స్ అన్నేసి మాటలు అనడం సమంజసం కాదని, బికినీలు వేసినంత మాత్రానా మేమేమి పోర్న్ సినిమాల్లో నటించడం లేదని అంటుంది హాట్ హాట్ అందాల ఆలియా !! ఈమె ఎవరో కాదు అప్పట్లో హాట్ హాట్ పాత్రలతో హీటెక్కించిన పూజ బేడీ కుమార్తె ? లేటెస్ట్ గా తన బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మతి పోగొట్టింది. దాంతో ఆమెపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆలియా పోర్న్ సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉంది అంటూ చేసిన కామెంట్స్ పై ఈమె ఇలా స్పందించింది. ఇలాంటి కామెంట్స్ కు హార్ట్ అయ్యానని, ఇలాంటి కామెంట్ ఇగ్నోర్ చేయడం ఎలాగో నేర్చుకుంటున్నా అంటూ మరో కామెంట్ పెట్టింది … ఈ గడుసు భామ !!