మంచి కోసం పోతే.. అమిర్ ఖాన్ మెడకు చుట్టుకుంది..!

Wednesday, February 22nd, 2017, 06:07:06 PM IST


బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇందులో ప్రత్యక్షంగా అమిర్ పాత్ర లేకపోయినా ఎన్నికల నియమావళిని అతిక్రమించాడనే ఆరోపణలు ఎదుర్కొనవలసి వస్తోంది. ముంబై బీఎంసీ ఎన్నికలలో భాగంగా చేసిన ప్రచారం అమిర్ మెడకు చిక్కుకుంది. ఈ సందర్భంగా అమిర్ ఓ ప్రకటనలో నటించాడు. నగరంలోని సమస్యలు పేర్కొంటూ ”ముంబై వాసులూ ఓటువేయండి” అని అమిర్ చేసిన ప్రకటన బిజెపి అనుకూలంగా ఉందనే విమర్శలు తలెత్తుతున్నాయి.

దీనితో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధన ప్రకారం ఫిబ్రవరి 19 సాయంత్రం 5:30 గంటల కల్లా ప్రచారం ముగించాలి. కాగా అమిర్ ఆరోజు నటించిన ప్రకటన మరుసటి రోజు పత్రికల్లో ప్రచురితమైంది. దీనితో అమిర్ చిక్కుల్లో పడ్డారు. ఆ ప్రకటన చేయించింది స్వచ్చంద సంస్థే అయినా దానితో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అమిర్ చేసిన ప్రకటన బిజెపికి అనుకూలంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు.