దమ్ము మీద దమ్ము లాగేస్తున్న బాలీవుడ్ స్టార్?

Sunday, November 27th, 2016, 11:00:25 AM IST

ameer-khan
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ .. ఆ మధ్య స్మోకింగ్ మానేసాడు? కారణాలు ఏవైనా తాను ఇంకా సినిమాల్లో కూడా స్మోకింగ్ చేయనని చెప్పేసాడు .. ఆ దిశగానే సినిమాలు చేసాడు. కానీ లేటెస్ట్ గా మళ్ళీ సిగరెట్ తాగడం మొదలు పెట్టాడట అమీర్!! అదేంటి .. మళ్ళి అయన సిగరెట్ ఎందుకు మొదలు పెట్టాడు .. ? అని అనుకుంటున్నారా .. అమీర్ ఖాన్ లేటెస్ట్ గా ”దంగల్” సినిమాలో నటిస్తున్నాడు. కుస్తీ పోటీల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకోసం అమీర్ ఏకంగా 20 కేజీల బరువు పెరిగి సినిమా చేసాడు .. ఇప్పుడు సినిమా విడుదలకు రావడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే టెన్షన్ ఎక్కువై సిగరెట్ తాగడం మొదలు పెట్టాడట !! సిగరెట్ మాములుగా తాగితే ఫరవాలేదు కానీ .. వరుసగా దమ్ము మీద దమ్ము కొడుతూ పొగలు రేపుతున్నాడని బాలీవుడ్ కోడై కూస్తుంది.