అమీర్ ఖాన్ కుమ్మేసాడబ్బా !!

Tuesday, January 31st, 2017, 09:47:37 AM IST

aamir-khan
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ మరోసారి తన సత్తా చాటాడు .. ఇంతకు ముందు ”పీకే” సినిమాతో భారీ విజయాన్ని అందుకుని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అమీర్ ఖాన్ .. తాజాగా నటించిన ”దంగల్” సినిమా కూడా దుమ్ము రేపే విజయాన్ని అందుకుని అందరికి షాక్ ఇచ్చింది ? ఒక సినిమాకు ఈ రోజుల్లో లాభాలు రావడం చాలా కష్టమే .. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే మహా అయితే 10 లేదా 20 పర్సెంట్ లాభాలు వస్తాయి తప్ప .. వందకు వంద శాతం లాభాలు రావడం ఈ మధ్య కాలంలో ఎక్కడ వినలేదు ? కానీ దంగల్ సినిమాకు దానికి రెట్టింపు లాభాలు ఆర్జించి షాక్ ఇచ్చింది? ఈ సినిమా ఏకంగా 300 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టి సంచలనం రేపింది. నిజంగా ఇది ఇండియన్ సినిమా చరిత్రలో సంచలనం. ఓక సినిమాకు మూడు వందల కోట్ల లాభం అంటే అది మాటలు కాదు !! అమీర్ ఖాన్ గత సినిమాలు 3 ఇడియట్స్ , ధూమ్ 3, పీకే సినిమాలు వంద, రెండొందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి. కానీ దంగల్ సినిమా మాత్రం మూడొందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల వసూలు సాధించిన ఈ సినిమా 380 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకోసం అమీర్ రెమ్యూనరేష్ తీసుకోలేదు. వచ్చిన లాభాల్లో మాత్రం యాభై శతం వాటా అడిగాడట .. అంటే అందులో 150 ఆయనదే మరి !!