ఇండియా- చైనా మార్కెట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌

Friday, April 27th, 2018, 09:33:02 PM IST

మ‌న సినిమాకి చైనా మార్కెట్లో మ‌హ‌ర్ధ‌శ ప‌ట్ట‌నుంది. అందుకు ఇప్ప‌టికే మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వేసిన దారి అక్క‌ర‌కొస్తోంద‌న్న‌ది తాజా రిపోర్ట్‌. అమీర్‌ న‌టించిన దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ సాధించిన అసాధార‌ణ స‌క్సెస్‌.. చైనాలో అమీర్‌కి ఏర్ప‌డిన ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌న భార‌తీయ సినిమాకి గొప్ప‌గా కలిసొస్తోంది. ముఖ్యంగా చైనీయులు అమీర్ అంకుల్అంటూ వెంట‌ప‌డేంత అభిమానం పెర‌గ‌డం పెద్ద ప్ల‌స్ కానుంది. స‌రిగ్గా ఇదే పాయింట్‌ని భార‌త‌దేశ‌ ప్ర‌భుత్వం ఆయుధంలా ఉప‌యోగించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలుస్తోంది.

చైనాలో కేవ‌లం భార‌తీయ సినిమాల మార్కెట్‌నే కాదు, ఇత‌ర‌త్రా వ‌ర్త‌క‌, వాణిజ్యాన్ని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు ఏకంగా అమీర్‌కి వ‌ల వేయ‌నుందిట‌. అమీర్‌ఖాన్‌ని ఇండో- చైనా బిజినెస్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. అమీర్‌ని ఇలా చైనా మార్కెట్‌కి ఎర వేయాల‌నుకోవ‌డానికి ప్ర‌త్యేకించి కార‌ణం కూడా లేక‌పోలేదు. అమీర్ అంకుల్‌కి కేవ‌లం చైనీయులే కాదు, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి హువా చున్‌యింగ్‌ కూడా వీరాభిమాని కావ‌డ‌మే ఈ ఆలోచ‌న‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇండియాలో చైనా వ‌స్తువుల వెల్లువ నేప‌థ్యంలో వాళ్ల‌కు రివ‌ర్స్ కోటింగ్ ఇవ్వ‌డం ఎలా? అన్న ఆలోచ‌న‌లో ఎంతో కాలంగా భార‌త్ ఉంది. అయితే ఆ కోటింగ్ ఇప్పుడు అమీర్‌తో సాధ్య‌ప‌డుతుందా? అంటే దానిని క‌న్ఫామ్ చేయ‌లేం కానీ, చాలా వాటిలో భార‌త్ స‌మృద్ధి సాధించేందుకు ఆస్కారాన్ని కొట్టి పారేయ‌లేం. ఒక‌వేళ ఇండో – చైనా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అమీర్ ఖాన్ ఎంపికైతే అది అన్ని ర‌కాల వాణిజ్యంతో పాటు, సినీప‌రిశ్ర‌మ‌కు ఎంతో మేలు చేస్తుందన‌డంలో సందేహం లేదు. అత‌డి ద్వారా మ‌న సినిమాలు అక్క‌డ రిలీజ్ చేసుకోవ‌డం సులువు అవుతుంది. అలానే అమీర్ న‌టించిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` చైనాలో అత్యంత భారీగా రిలీజ‌వుతుంద‌న్న స‌మాచారం ఉంది. ప‌నిలో ప‌నిగా `మ‌హాభార‌తం 3డి`ని ఐదు భాగాలుగా ఇండియా స‌హా చైనాలోనూ అమీర్ రిలీజ్ చేస్తాడు. రిల‌య‌న్స్ సంస్థ ఇప్ప‌టికే మ‌న సినిమాల చైనా రిలీజ్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల క్ర‌మంలో అమీర్ లెవ‌ల్ చైనాలో ఇప్ప‌టికంటే రెట్టింపు అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. అత‌డికి అంత‌కంత‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగితే అది మ‌న ఇత‌ర‌త్రా మార్కెట్ల‌ను చ‌క్క‌బెట్టేందుకు వీలు క‌లుగుతుంద‌న్న‌ది నిస్సందేహం. మొత్తానికి ఈ ప్లాన్ చూస్తుంటే ఇక ఇండియాని చైనాలో క‌లిపేసేట్టే క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments