హుజుర్ నగర్ లో ఎగిరేది తెరాస జెండానే… బయటపడ్డ ఆరా సర్వే…

Monday, October 21st, 2019, 07:55:11 PM IST

గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో అలజడి సృష్టించినటువంటి హుజుర్ నగర్ ఉప ఎన్నికల నేడు విజయవంతంగా పూర్తయింది. అయితే ఆ పోటీ అనేది ప్రధానంగా అధికార తెరాస మరియు, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యన ఉన్నప్పటికీ కూడా… ఈ ఎన్నికలో హుజుర్ నగర్ ప్రజలు కట్టనున్నారు, ఇప్పటికికూడా ప్రజలు తెరాస నే నమ్ముతున్నారా, లేక ఎదావిదిగా ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించనున్నారా అనే ప్రశ్నలు అందరిని కొంత ఉత్కంఠ కు గురిచేస్తున్నాయి. కాగా తాజాగా బయటకొచ్చిన ఆరా సర్వే మాత్రం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ ఆరా సర్వే ఫలితాల ప్రకారం ఈ హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచేది అధికార తెరాస పార్టీ అని తేల్చి చెబుతుంది.

కాగా నేడు ఉత్కంఠభరితంగా జరిగినటువంటి హుజుర్ నగర్ ఉపఎన్నికలో 50.48 శాతానికి పైగా ఓట్లు అధికార తెరాస కి పడ్డాయని, మిగతా 39.95 శాతం ఓట్లు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కి పడ్డాయని, ఇకపోతే 9.57 శతం ఓట్లు ఇతరులకు పడ్డట్లు ఆరా సర్వే చెబుతుంది. కాగా గతంలోకూడా చాలా సార్లు ఎన్నికల ఫలితాలపై తనదైన ముద్రతో సర్వే జరిపిన ఆరా సంస్థ తాజాగా హుజుర్ నగర్ లో జరిగినటువంటి ఉపఎన్నికపై కూడా సర్వే జరపగా, గెలుపు తెరాస పార్టీదే అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా ఈ సర్వే జరిపిన విధంగానే ఫలితాలు వెల్లడవుతాయా లేక ప్రజల తీర్పు ఇంకోలాగా ఉంటుందా అనేది తెలియాలంటే మాత్రం మరొక మూడు రోజులు తప్పదు.